Political News

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం చూసి తాను క‌రిగిపోయాన‌ని చెప్పారు. తాజాగా అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని మ‌న్యంలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. అడ‌వి త‌ల్లిబాట‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నుల సంప్ర‌దాయ నృత్యాలు, వారి సంస్కృతిని ప‌రిశీలించారు. అదేస‌మ‌యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ(ఒక‌ప్పుడు న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతం)లో ప‌లు రోడ్ల నిర్మాణానికి శంకు స్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం సాయంత్రం గిరిజ‌నుల‌తో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఔదార్యం చూసి తాను క‌రిగిపోయాన‌ని చెప్పారు. గిరిజ‌న ప్రాంతాల్లో అడ‌వి బిడ్డ‌లు.. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా.. డోలీ క‌ట్టుకుని న‌గ‌రాలకు వ‌స్తున్నారు. నేను అనేక సంద‌ర్భాల్లో ఈ వార్త‌లు చూశా. చ‌లించిపోయా. ఏదైనా చేయాల‌ని సంక‌ల్పించా. కానీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈ స‌మ‌స్య‌పై లోతుగా చ‌ర్చించా. ర‌హ‌దారుల నిర్మాణం ఒక్క‌టే మార్గ‌మ‌ని.. నిర్ణ‌యించుకున్నా. ఆ వెంట‌నే చంద్ర‌బాబును క‌లిసి.. స‌మ‌స్య చెప్పా అని తెలిపారు.

గిరిజ‌న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబునుకోరిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. అయితే.. త‌న విజ్ఞ‌ప్తిని విన్న చంద్ర‌బాబు.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. వెంట‌నే 49 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశారని తెలిపారు. 24 గంట‌ల్లో అవి ఖాతాల్లోకి ప‌డ్డాయన్నారు. ఆయ‌న ఔదార్యాన్ని చూసి త‌న మ‌న‌సు క‌రిగిపోయింద‌న్నారు. గిరిజ‌నులకు భౌతిక మైన విద్య లేక‌పోవ‌చ్చ‌ని.. కానీ, వారు నిపుణుల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కొనియాడారు. అనేక రూపాల్లో వారి క‌ళ‌లు ప్రాశ‌స్త్యం పొందుతున్నాయ‌న్నారు. అయితే.. వారికి కొంత సాయం చేస్తే..మ‌రింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఇప్పుడు తాను చేస్తున్న ప్ర‌య‌త్నం కూడా.. అదేన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. గిరిజ‌న‌ ప్రాంతంలో రోడ్లు బాగుండాలని.. ఆ దిశ‌గా తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు. వైసీపీ హ‌యాంలో ర‌హ‌దారులు గోతుల మ‌యంగా ఉండేవ‌ని.. ఐదేళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేశార‌ని.. దీంతో ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ దుయ్య‌బ‌ట్టారు. తాము కేవలం ఏడాదిలోపే 1,500 కోట్లు ఖ‌ర్చు పెట్టి ర‌హ‌దారుల‌ను నిర్మిస్తున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on April 8, 2025 5:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో ట్రాజిక్ ఎండింగ్? : దర్శకుడు ఏమన్నాడంటే…

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ…

12 minutes ago

ఇలాంటి క‌న్నీళ్లు… లోకేష్ ఎప్పుడూ చూసి ఉండ‌రు!

క‌న్నీళ్లు క‌ష్టాల్లోనే కాదు.. ఇష్టాల్లోనూ వ‌స్తాయి. ఏక‌న్నీరెన‌కాల ఏముందో తెలుసుకోవ‌డం.. ఈజీనే!  ఇప్పుడు ఇలాంటి క‌న్నీళ్లే.. మంత్రి నారా లోకేష్‌ను…

17 minutes ago

17 ల‌క్ష‌ల‌తో భోజ‌నం పెట్టారు: లెజినోవాపై ప్ర‌శంస‌లు!

సింగపూర్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో త‌మ కుమారుడు మార్క్ శంక‌ర్ కోలుకుని ఇంటికి తిరిగి వ‌చ్చిన క్ష‌ణాల నేప‌థ్యంలో ఏపీ…

2 hours ago

ఎన్టీఆర్ లైనప్‌పై కళ్యాణ్ రామ్ క్లారిటీ

టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా…

3 hours ago

తెలంగాణలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ… ఎవరికి ఎంతంటే?

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోమవారం ఓ కీలక అడుగు వేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి…

3 hours ago

రెమ్యూనరేషన్ తేడాలపై సమంత వాయిస్

సినీ రంగంలో హీరోలకు భారీగా పారితోషకాలు ఇస్తారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్.…

4 hours ago