అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ అయితే ఏకంగా భారతీయ ఆక్వా రైతులపై ప్రత్యక్షంగా పడింది. ఆంధ్రా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై దిగుమతి సుంకాన్ని 3 శాతం నుంచి 26 శాతానికి పెంచింది ట్రంప్ సర్కార్. అంటే, లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఇకపై లక్షా 26 వేలు కానున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని, ఆ దిగుమతి సుంకాల కేటగిరీలో నుంచి ఆక్వా రంగాన్ని మినహాయించాలని కోరారు. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ మన దేశం..ఏపీకి మాత్రమే కాదు…చాలా దేశాలపై పడింది. అయితే, ఇవన్నీ పట్టని జగన్ మాత్రం దొరికిందే చాన్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు..చంద్రబాబును విమర్శించడమే నా పని అన్న రీతిలో చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ కొన్ని ప్రశ్నలు సంధించారు.
ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, టారిఫ్ ల పేరు చెప్పి టీడీపీకి చెందిన వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రొయ్యల ధరల పతనంపై ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని, కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని నిలదీశారు.
కూటమి పాలనలో ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా పంటలకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లేవంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగి తప్పించుకుంటోందని అన్నారు. ఎగుమతుల్లో, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్ అని, తమ హయాంలో ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించి నాణ్యత పాటించేలా చట్టాలు తెచ్చామని, కానీ, ఈ ప్రభుత్వంలో సిండికేట్‌గా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఆక్వా జోన్ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించామని గుర్తు చేశారు. రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోవాలని చంద్రబాబును జగన్ డిమాండ్ చేశారు. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చేసిన దానికి బాబును తిడితే ఎలా జగన్ అంటూ జగన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ జగన్ అధికారంలో ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి అని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చాలా బెటర్ అని, రొయ్యల వ్యాపారుల దుస్థితిపై వెంటనే కేంద్ర మంత్రికి లెటర్ రాశారని, అదే జగన్ అయితే కేసుల భయంతో కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండేది కాదని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
This post was last modified on April 7, 2025 9:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో తొలి పదేళ్లు పక్కా క్లాస్ మూవీసే చేశాడు. అతడి ఫ్యాన్స్‌లో కూడా ఎక్కువగా క్లాస్…
నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ…