జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి పుత్రులకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే బృహత్కార్యం ‘అడవి తల్లి బాట’ను ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం జరిగిన సోమవారమే పవన్ కారణంగా 30 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. విశాఖలో పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ను నిలిపివేయగా. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు వెళుతున్న విద్యార్థుల్లో 30 మంది సకాలంలో పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్నది ఆ ప్రచారం సారాంశం. ఈ వార్తల్లో లేశమాత్రం కూడా వాస్తవం లేదని విశాఖ నగర పోలీసులు సోమవారం రాత్రికే తేల్చి పారేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసు శాఖ సమగ్ర వివరాలతో ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేసింది.
విశాఖ సిటీ పోలీస్ ప్రకటన ప్రకారం… జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు సోమవారమే ప్రారంభం కాలేదు. ఈ నెల 2 నుంచే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జేఈఈ అడ్మిట్ కార్డుల్లోని నిబంధనల మేరకు విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఉదయం 8.30 గంటకు పరీక్షా కేంద్రం గేట్లను అధికారులు మూసివేస్తారు. అంటే 8.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు..అయితే సోమవారం విశాఖలో పవన్ కాన్వాయ్ ఆ దారి మీదుగా ఉదయం 8.41 గంటలకు వెళ్లింది. అంటే.. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఆ ప్రాంతం మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లింది. అంటే.. పవన్ కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్న మాటలో వాస్తవం లేదు.
ఇక సోమవారం నాడు సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్న పరీక్షా కేంద్రానికి రోజు మాదిరే సోమవారం కూడా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి పరీక్షలు మొదలు కాగా..సదరు కేంద్రంలో పరీక్ష జరిగిన నాలుగు వరుస రోజుల్లో ప్రతి రోజు 81, 65, 76, 61 మంది చొప్పున పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక సోమవారం నాటి పరీక్షకు కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ గైర్హాజరీ అంకెలన్నీ ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన వారితో కలుపుకుని లెక్కించినవే. ఈ లెక్కన సోమవారం నాటి పరీక్షకు 30 మంది విద్యార్థుల గైర్హాజరుకు పవన్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ఇక ఈ పరీక్షా కేంద్రం ఉన్న గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో ఉదయం 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయలేదని కూడా పోలీసులు వెల్లడించారు.
This post was last modified on April 7, 2025 9:36 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్‌డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…