Political News

బూతుల ‘నానీ’కన్నా పనిచేసే రాము మిన్న

ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితె వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు కొడాలి నానీ. ఆయ న అస‌లు ఏదున్నా.. ఆయ‌న మాత్రం నానీ పేరుతోనే ఫేమ‌స్ అయ్యారు. అయితే.. ఒక్క ఓట‌మి నాయ కుల‌ను కుంగ‌దీయ‌క‌పోవ‌చ్చు. వారి పేరును కూడా భూస్థాపితం చేయ‌క‌పోవ‌చ్చు. కానీ, ఒక అభివృద్ధి.. ఒక సంక్షేమం.. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే నాయ‌కుడు. వారిని అక్కున చేర్చుకునే నాయ‌కుడు ఉంటే మాత్రం ఎంత పేరెన్నిక‌గ‌న్న నాయ‌కుడైనా.. తెర‌మ‌రుగు కావాల్సిందే.

ఇప్పుడు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో అచ్చంగా అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంటోంది. గ‌త ఏడాది జ‌రిగి న ఎన్నిక‌ల్లో ఎన్నారై టీడీపీ నాయ‌కుడు వెనిగండ్ల రాము.. గుడివాడ‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. దీనికి ముందు ఆయ‌న పాద‌యాత్ర చేశారు. ఈ పాద‌యాత్రలో ఆయ‌న అనేక స‌మ‌స్య‌లు చూశా రు. అనేక మంది స‌మ‌స్య‌లు కూడా విన్నారు. తాను ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. వ‌రుస పెట్టి వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా భారీ ప్రాజెక్టుకు కూడా వెనిగండ్ల శ్రీకారం చుట్టారు.

కీల‌క‌మైన గుడ్లవల్లేరు – ముదినేపల్లి రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారు. నియో జకవర్గంలో దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న ఎమ్మెల్యే రాము.. గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డు, ముదినేపల్లి – గుడ్లవల్లేరు రహదారుల అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. అంతేకాదు.. గ‌త ప‌ది నెల‌ల స‌మ‌యంలోనే గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు.

ఇటీవ‌ల‌ రూ.21.93 కోట్లతో.. 57.98 కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇది వైసీపీ హ‌యాంలోనే వేయాల‌ని అనేక మంది డిమాండ్ చేసినా.. అప్ప‌టి ఎమ్మెల్యే నాని ప‌ట్టించుకోలేదు. కానీ, రాము ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. ప‌లు మార్లు ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రిని క‌లిసి నియోజ‌క వ‌ర్గంలో ర‌హ‌దారుల దుస్థ‌తిని వారికి వివ‌రించారు. ఫ‌లితంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఎటు చూసినా.. అద్దంలా మెరిసిపోతున్న ర‌హ‌దారులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో నాని పేరును దాదాపు మ‌రిచిపోయే ప‌రిస్తితి రాజ‌కీయంగా వ‌చ్చింద‌ని టీడీపీనేత‌లు చెబుతున్నారు.

This post was last modified on April 6, 2025 10:05 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

18 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago