సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్‌షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని.. వారిని విద్య, ఉద్యోగాలు, నివాసం సహా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంపన్నులుగా తీర్చిదిద్దడమే పీ-4 కీలక లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు కలసి రావాలంటూ.. ఉన్నత స్థాయి వర్గాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి.. పీ-4 ద్వారా వారికి అందే చేయూతను వివరించారు.
ఇక, పీ-4 కార్యక్రమానికి స్పందనగా.. ప్రముఖ విత్తన వ్యాపార సంస్థ ప్రసాద్ సీడ్స్ అధినేత.. ప్రసాద్.. సీఎం చంద్రబాబుకు 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను పీ-4 కార్యక్రమానికి వినియోగించాలని సూచించారు. ప్రధానంగా కొమ్మూరు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం)కు ఈ నిధులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొమ్మూరు పరిధిలో రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా వారికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వేలాది ఎకరాల పంటలు.. లిఫ్ట్ ఇరిగేషన్‌పైనే ఆధారపడి ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతన్నారని.. వీరిని ఆదుకునేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రసాద్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని.. ఆ నిధులను కొమ్మురు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వినియోగిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.10 కోట్లను బదిలీ చేయాలని సీఎంవో వర్గాలను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులోనూ.. ప్రసాద్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
This post was last modified on April 5, 2025 10:38 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…