ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ దిశగా జరిగే ఏ ఒక్క ప్రచారాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కూడా చెప్పాలి. అసలు అలాంటి అనుమానాలు రేకెత్తేలా వ్యవహరించే వారికి తగిన బుద్ధి కూడా చెప్పాల్సిన అవసరం ఉందనీ చెప్పక తప్పదు. వెరసి విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ప్రకటించిన సంకల్పం అంతకంతకూ బలోపేమవుతోంది. ఆ దిశగా సోమవారం కీలక అడుగు పడింది. విశాఖ ఉక్కు బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు ఇవేనంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ టీడీపీ అదినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు వివరాలను అలా పెట్టేసింది.
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆ శాఖ కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారలను వెంటబెట్టుకుని సోమవారం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మతో పాటుగా ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, సంయుక్త కార్యదర్శి అబిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ ఎండీ అమితవ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇంచార్జీ సీఎంగా అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాలపంచుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు బలోపేతానికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందన్న విషయంపై చంద్రబాబు వీరితో ఆరా తీశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలను వారు చంద్రబాబుకు వివరించారు.
నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన విశాఖ ఉక్కును ప్రైవేటు విక్రయిస్తే తప్పించి ఆ సంస్థ పనితీరు మెరుగుపడదన్న వాదనలు గతంలో వినిపించాయి. అయితే ఆంధ్రులు పోరాడి సాధించుకున్న ఈ కంపెనీని కోల్పోయేందుకు ఏపీ ప్రజలు సిద్థంగా లేరు. ఈ క్రమంలో విశాఖ ఉక్కును కాపాడుకనే దిశగా ఉద్యమాలకు రంగం సిద్ధం కాగా… విశాఖ ఉక్కును కాపాడతామని మొన్నటి ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రకటించింది. ఈ మాటలు నమ్మి జనం కూటమికి రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి కూడా కేంద్రంతో విశాఖ ఉక్కుక రూ.13 వేల కోట్లకుపైగా భారీ ప్యాకేజీని ప్రకటించేలా చేసింది. ఈ ప్యాకేజీ అమలును పరిశీలించేందుకు విశాఖ వచ్చిన ఉక్కు మంత్రిత్వ శాఖ పనిలో పనిగా సీఎం చంద్రబాబును కలిసి… విశాఖ ఉక్కుకు ఇక ఢోకా లేదన్న భరోసాను ఇచ్చేసి వెళ్లింది.
This post was last modified on April 1, 2025 7:16 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…