Political News

కేతిరెడ్డి రాజకీయం వదిలేస్తున్నారా.?

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి.. 2009లో కాంగ్రెస్ టికెట్ పై 2019లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీతోనే కలిసి సాగుతున్న కేతిరెడ్డి…వైసీపీ సర్కారు అధికారంలో ఉండగా . తనదైన శైలి గ్రామాల పర్యటన, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. వైసీపీ పథకాలు వద్దన్న టీడీపీ శ్రేణులతో…”వద్దనుకుంటే తీసుకోవద్దండి. వేరే వాళ్లకు అయినా పనికొస్తాయి” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి కలకలం రేపారు.

అయినా ఇప్పుడు కేతిరెడ్డి విషయం ఎందుకంటారా?… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం దక్కింది కదా. 151 సీట్లున్న వైసీపీ కూటమి దెబ్బకు 11 సీట్లకు పడిపోయింది. 209 ఎన్నికల్లో ఈ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదని విశ్లేషణలు సాగుతున్నాయి. వైసీపీ మాదిరే కేతిరెడ్డి కూడా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త నేత సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఓ వైపు రాప్తాడును చూసుకుంటూనే ధర్మవరంపైనా పరిటాల ఫ్యామిలీ ఎప్పటి నుంచో దృష్టి పెట్టింది. ఈ ఐదేళ్లలో పరిటాల శ్రీరామ్ ధర్మవరాన్ని చుట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ లెక్కలన్నీ వేసుకున్నారో, ఏమో తెలియదు గానీ… కేతిరెడ్డి రాజకీయాలను వదిలే దిశగా కదులుతున్నారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలకు కేతిరెడ్డి చర్యలే కారణంగా నిలుస్తుండటం గమనార్హం.

సోమవారం సాయంత్రం జనమంతా రంజాన్ వేడుకల్లో మునిగిపోయి ఉన్న సమయంలో కేతిరెడ్డి సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియో పోస్టు అయ్యింది. అందులో ఆయన ఓ పైలట్ గా అవతారం ఎత్తిన దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియోలో్ ఆయన సింగిల్ గానే ఓ ప్రవేట్ జెట్ ను నడిపిన వీడియో కూడా మధ్యాహ్నం నుంచే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కేతిరెడ్డి మనకు పొలిటీషియన్ గానే తెలుసు. అయితే విద్యాధికుడు అయిన కేతిరెడ్డి పూర్వా శ్రమంలో ఏం చదివారో మనకు తెలియదు కదా. ఇప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా ప్రైవేట్ జెట్ ను ఆయన నడిపారంటే… కేతిరెడ్డి పైలట్ ట్రైనింగ్ తీసుకునే ఉంటారు కదా. ఈ లెక్కలన్నీ తీసిన నెటిజన్లు…కేతిరెడ్డి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటన్నారంటూ కామెంట్లు చే్స్తున్నారు. కొన్ని అంశాల్లో వైసీపీ అధిష్ఠానాన్ని కూడా తప్పుబట్టిన కేతిరెడ్డి రాజకీయాలను వదిలేసి పైలట్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 31, 2025 8:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…

7 hours ago

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని…

9 hours ago

అభిమానులను తిడితే సినిమా హిట్టవుతుందా

హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…

9 hours ago

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…

9 hours ago

టీడీపీలో కుములుతున్న ‘కొన‌క‌ళ్ల’.. ఏం జ‌రిగింది ..!

మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు.. త‌న యాక్టివిటీని త‌గ్గించారు. ఆయ‌న పార్టీలో ఒక‌ప్పుడు యాక్టివ్…

10 hours ago

ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…

11 hours ago