Tv5 Murthy
అందరూ కరోనా గురించే చర్చించుకుంటున్న సమయంలో ఆంద్రప్రదేశ్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అనదగ్గ అగ్రశ్రేణి తెలుగు న్యూస్ యాంకర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.
జగన్ సర్కారు అమరావతి నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయించినప్పట్నుంచి టీవీ 5 ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమరావతి ఉద్యమానికి విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. అక్కడి రైతుల గోడును ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక గత ఏడాది కాలంలో జగన్ సర్కారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలపై టీవీ 5 నిలదీస్తూనే ఉంది. వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. కరోనా వేళ జగన్ సర్కారు వైఫల్యాలన్నింటినీ ఆ ఛానెల్ ఎండగడుతోంది.
సంబంధిత చర్చా కార్యక్రమాలన్నింటినీ మూర్తినే నడిపిస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఆయన ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారని.. వారికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారని ప్రభుత్వం అంటోంది.
ఈ కారణంతోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ సమయంలో ఓ టాప్ న్యూస్ యాంకర్‌ను టార్గెట్ చేస్తే జగన్ సర్కారు విమర్శల పాలవడం ఖాయం. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
This post was last modified on April 30, 2020 12:39 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…