Political News

కుప్పానికి మదర్ డెయిరీ రెడీ..బాబుదే లేటు

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ అండీ…మీరు స్థలం ఇవ్వడమే లేటు అంటూ చాలా కంపెనీలు ఏపీ మాట కోసం వేచి చూస్తున్నాయంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తన్న కుప్పం పరిధిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ సిద్దంగా ఉంది. కుప్పంలో సదరు ప్లాంట్ కు అవసరమైన స్థలాన్ని కేటాయించిన వెంటనే రంగంలోకి దిగిపోతామంటూ ఆ సంస్థ ఎండీ మనీష్ బాండ్లిష్ ఆదివారం ప్రకటించారు.

పాల పంపిణీలో దేశంలోనే పేరెన్నికగన్న సంస్థగా గుర్తింపు సంపాదించుకున్న మదర్ డెయిరీ… గత కొంతకాలం క్రితం పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మూడు ప్లాంట్లను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ రంగంలో మంచి పనితీరు కనబరుస్తున్న ఆ సంస్థ ఈ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అందలో ఒక ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఏర్పాటు చేయాలని భావించగా… గుజరాత్ ప్రభుత్వం ఆ కంపెనీకి ఓకే చెప్పేయడంతో పాటుగా స్థలాన్ని కూడా కేటాయించింది. దీంతో గుజరాత్ లో రూ.600 కోట్లతో ఓ భారీ ప్లాంటును మదర్ డెయిరీ ఏర్పాటు చేస్తోంది.

ఇక మిగిలిన మరో ప్లాంటును కుప్పంలో ఏర్పాటు చేయనున్నట్లు మనీష్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా… కూటమి సర్కారు అందుకు సమ్మతించిందట. దీంతో రెండో ప్లాంటును కుప్పంలోనే ఏర్పాటు చేయాలని మనీష్ ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ.200 కోట్ల మేర పెట్టుబడిని పెట్టాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కుప్పంలో తమకు ఎంతమేర స్థలాన్ని కేటాయిస్తుందన్న దాని ఆధారంగా పెట్టే పెట్టుబడి ఎంత అన్న దానిని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఈ లెక్కన ఓ బారీ ప్లాంటుకు సరిపడా స్థలాన్ని కేటాయిస్తే.. మదర్ డెయిరీ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాపెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కుప్పం పరిధిలోని పండ్లు, కూరగాయల రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పాలి.

This post was last modified on March 31, 2025 7:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశాఖ టార్గెట్‌గా నారా లోకేష్ పావులు…!

ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. త‌ర‌చుగా విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌డంతోపాటు.. జిల్లా రాజ‌కీయాల‌పై…

2 minutes ago

కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం…

1 hour ago

మే వ‌ర‌కు ఆగుదాం.. జ‌గ‌న్ డెడ్‌లైన్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే క్ర‌తువుకు డెడ్‌లైన్ పెట్టారు. ఇప్ప‌టికి రెండు సార్లు ఇలా…

2 hours ago

తీవ్రవాదుల వేటలో ‘జాక్’ సరదాలు

https://www.youtube.com/watch?v=orJ_CQ3VU28 డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరస బ్లాక్ బస్టర్లు ఇచ్చాక ఏడాది పైనే గ్యాప్ వచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ…

2 hours ago

సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు…

3 hours ago

కాంతార‌ చాప్టర్ 1 వాయిదా.. నిజ‌మేనా?

గ‌త కొన్నేళ్ల‌లో ఇండియ‌న్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచ‌ల‌నం అంటే.. కాంతార మూవీనే అని చెప్పాలి. కేవ‌లం రూ.16 కోట్ల…

3 hours ago