వల్లభనేని వంశీ. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. కానీ, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ. వివిధ కేసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సుమారు రెండు మాసాలకు పైగానే వంశీ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. వంశీని బయటకు వదిలితే.. టీడీపీ నాయకుడు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ను చంపేసే ప్రమాదం ఉందంటూ.. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. మరి అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని పోలీసులు ఎలా ట్రీట్ చేయాలి? ఆయనను జోరుగా జనంలోకి వదిలేస్తారా? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆత్కూరు మండలానికి చెందిన శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి.. తన భూమిని కొందరు కబ్జా చేశారని.. దీనికి వంశీ సహకరించారని కొన్నాళ్ల కిందట కేసు పెట్టాడు. ఈ విషయంనూ గన్నవరం కోర్టు వంశీకి జైలు శిక్ష విధించింది. అయితే.. ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేసులో జైల్లో ఉన్న వంశీని ప్రత్యేకంగా జైల్లో పెట్టేది లేదు కనుక.. ఈ కేసులోనూ అదే రిమాండ్ ఖైదీగా కొనసాగించాలని కోర్టు చెప్పింది. ఇక, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తమ కస్టడీకి వంశీని అప్పగించాలని పోలీసులు పెట్టుకున్న అభ్యర్థన మేరకు.. కోర్టు శనివారం ఒక్కరోజు కస్టడీకి అప్పగించింది.
మరి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి.. అంతే భద్రంగా కోర్టుకు, అటు నుంచి జైలుకు అప్పగించాలి. కానీ, ఇక్కడే పోలీసులు చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. వంశీని రిమాండ్ ఖైదీగా కాకుండా.. ఎమ్మెల్యేగా.. ప్రజాప్రతినిధిగా ట్రీట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు హాజరు పరిచేందుకు వంశీని పోలీసులు తమ వాహనాల్లో తీసుకువచ్చారు. అయితే.. ఈ సమయంలో భారీ సంఖ్యలో వంశీ తన అనుచరుల ద్వారా ప్రజలను పోగు చేశారు. వారితో కరచాలనాలు.. విషెస్, లాలనలు, బుజ్జగింపులు వంటివి చేశారు.
అంతేకాదు.. వంశీ.. తనవారితో మాట్లాడేందుకు కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే.. ఉన్నస్థాయి అధికారులు కూడా ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు.. తప్ప.. “మీరు రిమాండ్ ఖైదీ..ఇలాంటివి కుదరదు” అని చెప్పిన పాపాన పోలేదు. పైగా.. ఆయనకు పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వంశీ విషయాన్ని పక్కన పెడితే.. ఒకవేళ అభిమానుల ముసుగులో ఆయన అనుచరులే.. ఆయనపై దాడి చేసి.. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే.. దానికి ఎవరు బాధ్యలు? ప్రభుత్వానికి చెడ్డపేరు రాదా? కాదా? అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. ఏదేమైనా.. వంశీ సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో వంశీది తప్పా.. పోలీసులది తప్పా..? అన్నది సర్కారు తేల్చి భవిష్యత్తులో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
This post was last modified on March 30, 2025 6:30 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…