వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలపై పోరాడిన సీనియర్ జర్నలిస్టు, ఓ ప్రధాన పత్రికలో సబ్ ఎడిటర్‌గా, రిపోర్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన.. అంకబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు సమున్నత సత్కారం ప్రకటించారు. అమరావతి రాజధాని ఉద్యమం సహా.. డాక్టర్ సుధాకర్‌ను రెండు చేతులు వెనక్కి విరగ్గట్టి నడిరోడ్డుపై అరెస్టు చేసిన తీరును అంకబాబు ప్రశ్నించారు. అంతేకాదు.. తన సోషల్ మీడియా, సొంత చానెల్ ద్వారా.. వైసీపీ ప్రభుత్వ పనితీరును ఆయన పదే పదే ప్రశ్నించారు.
ఇక, చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని తనదైన శైలిలో అంకబాబు ప్రశ్నించారు. అనేక వ్యాసాలు రాయడంతోపాటు వ్యాఖ్యలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. అయితే.. బాబు అరెస్టు కన్నా ముందే.. వైసీపీప్రభుత్వం అంకబాబుపై కత్తికట్టినట్టు వ్యవహరించింది. 72 ఏళ్లవయసులో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి ఇంటి నుంచి అరెస్టు చేసిన తీరు.. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అనేక న్యాయ పోరాటాల తర్వాత.. అంకబాబుకు బెయిల్ లభించింది. దీంతో వైసీపీ సర్కారు తీరు.. అప్పట్లో జాతీయస్థాయిలో చర్చకు వచ్చింది.
తనను అరెస్టు చేసినా.. న్యాయం కోసం తన పోరాటం ఆగదని చెప్పిన అంకబాబు.. చంద్రబాబు అరెస్టు తర్వాత.. మరింత చైతన్యం అయ్యారు. ఆయన అరెస్టును ఖండిస్తూ.. వైసీపీ దుర్మార్గాలను ఉటంకిస్తూ.. అనేక వ్యాసాలు, వ్యాఖ్యలు పంచుకున్నారు. ఇది యువతలోనూ.. టీడీపీ అభిమానుల్లోనూ ఎంతో చైతన్యంకలిగించి.. చంద్రబాబు కోసం అందరూ ఐక్యం అయ్యేలా పనిచేసిం దనడంలో సందేహం లేదు. ఇక, ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా అంకబాబును కళారత్న
పురస్కారానికి ఎంపిక చేసింది. జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా.. ఉగాది నాడు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వనున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద మీడియా సంస్థగా ఉన్న ఆంధ్రజ్యోతికి చెందిన సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం సెంట్రల్ ఏపీ ఇంచార్జ్‌గా ఉన్న కోరే సుధాకర్‌ను కూడా ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారానికి ఎంపిక చేసింది. సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంలో సుధాకర్.. అనేక ప్రయోగాలు చేశారు. రాజకీయాలే కాకుండా.. మానవీయ కోణాల్లో కథనాలు అందించారు. కాగా.. కళారత్న పురస్కారం కింద.. ప్రభుత్వం రూ.లక్ష నగదు, మొమెంటో, శ్శాలువాతో ఘనంగా సత్కరించనుంది.
This post was last modified on March 30, 2025 6:35 am
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…