జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కరోనా వైరస్ కేసులు రోజుకు సగటున 3 వేలు రిజస్టర్ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతోందని ఆందోళన పెరిగిపోతోంది. వచ్చే మూడు, నాలుగు నెలల వరకు జనాలందరు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రప్రభుత్వం, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సమయంలో విద్యాసంస్దలు తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.
నవంబర్ 2వ తేదీ నుండి స్కూళ్ళు, కాలేజీలన్నింటినీ తెరవబోతున్నారు. డిసెంబర్ 14వ తేదీ నుండి ప్రాధమిక పాఠశాలలు స్టార్ట్ అవుతాయట. ఉన్నత విద్యాసంస్దల్లో ఏమో రోజుకు తరగతి గదిలోని టోటల్ స్ట్రెంగ్త్ లో 3వ వంతు విద్యార్ధులు మాత్రమే హాజరవ్వాలట. 9,10 తరగతులకు, ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు రోజుమార్చి రోజు ఒక్కపూట మాత్రమే హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పంది. అలాగే నవంబర్ 23 నుండి 6, 7, 8 తరగతుల విద్యార్ధులకు కూడా ఒంటిపూట బడులు మొదలవ్వబోతున్నాయి.
ఇక డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీలకు కూడా ప్రభుత్వం రకరకాల కరిక్యులమ్ విడుదల చేసింది. రోజు మార్చి రోజు కాలేజీ జరుగుతుందన్నది. తరగతికి ఎంతమంది విద్యార్ధులు హాజరవ్వాలి ? విద్యాసంస్ధకు రాని విద్యార్ధులకు టీచింగ్ ఆన్ లైన్లో జరగాలనేటువంటి రకరకాల నిబంధనలను చాలానే విధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యార్ధుల తరపున, మేనేజ్మెంట్ తరపున ఇన్ని రకాలుగా ఆలోచించిన ప్రభుత్వం మరి టీచర్ల తరపున ఏమీ ఆలోచించినట్లు లేదు.
విద్యార్ధలు రోజుమార్చి రోజు క్లాసులకు హాజరవుతారని ప్రభుత్వం చెప్పింది బాగానే ఉంది. విద్యాసంస్ధ మొత్తాన్ని శానిటైజ్ చేయాలని చెప్పింది కానీ ఆచరణలో ఎంత వరకు అమలవుతుందో గ్యారెంటీ లేదు. టీచర్లకు మాత్రం ఈ పద్దతి పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఎలాగంటే ఒకే పాఠాన్ని రెండుసార్లు చెప్పాల్సుంటుంది. క్లాసులోని మొత్తం విద్యార్ధులు రెండు విడతలుగా హాజరవుతారంటే మరీ టీచర్లు చెప్పిన పాఠాన్నే చెప్పాల్సుంటుంది కదా.
ఇదే సమయంలో వందలాదిమంది విద్యార్ధులు ఒకేచోట చేరినపుడు వారిలో ఎవరకైనా కరోనా వైరస్ ఉంటే మిగిలిన వాళ్ళకు సోకితే అప్పుడు పరిస్దితేమిటి ? విదేశాల్లో వైరస్ ప్రభావం తగ్గిపోతోందన్న కారణంతోనే విద్యాసంస్ధలను తెరిచాయి. అయితే మళ్ళీ కరోనా చాలా స్పీడుగా వ్యాప్తి చెందింది. బహుశా ఇటువంటి కారణాలతోనే ప్రపంచదేశాల్లో మళ్ళీ కరోనా పెరిగిపోతుంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని మొత్తుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంగానే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించలేమని చెప్పిన ప్రభుత్వం విద్యాసంస్ధలు తెరవటానికి రెడీ అయిపోవటమే కొసమెరుపు.
This post was last modified on October 30, 2020 10:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…