Political News

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అలా ఒప్పందాలపై సంతకాలు కాగానే… ఇలా సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ సిద్ధమైపోయింది. అదే సమయంలో గట్స్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడెప్పుడు సహకారం లభిస్తుందా?అని ఎదురు చూసిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా…ఆ సంస్థ నుంచి సహకారం అందుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అంతే… రోజుల వ్యవధిలోనే ఈ సహకారానికి సంబంధించి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అయ్యింది.

గేట్స్ ఫౌండేషన్ నుంచి సహకారం స్వీకరించడంతో పాటుగా ఆ సంస్థ సహకారాన్ని అందించే విషయాన్ని.. అంటే ఇరు వర్గాలనూ సరైన దారిలో నడిపే దిశగా ఓ టాస్క్ ఫోర్స్ ఉండాలని ఇటు కూటమి సర్కారు, అటు గేట్స్ ఫౌండేషన్ భావించాయి. ఇరు వర్గాలూ ఓకే భావనతో సాగుతున్న వేళ…ఈ ఒప్పందాలను సక్రమంగా అమలు చేయడంతో పాటుగా ఆ సహకారం నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టేలా మానీటరింగ్ చేసేందకు ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఓ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో పాటుగా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఉంటారు.

ఏపీలో విద్య, వ్యవసాయం, ఉపాది, సుపరిపాలన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు గేట్స్ ఫౌండేషన్ తన సహకారాన్ని అందించనుంది. అంతేకాకుండా ఈ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఫలితంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించడంపై గేట్స్ ఫౌండేషన్ తన సహకారాన్ని అందించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పై రంగాల్లో ఏపీ పురోభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఈ ఒప్పందం ఇతోదికంగా దోహదపడనుంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో ఈ ప్రాజెక్టు అతి త్వరలోనే పట్టాలెక్కబోతోందని చెప్పక తప్పదు.

సాధారణంగా ఏదైనా సంస్థ ఏపీ, తెలంగాణకో, లేదంటే ఇంకే రాష్ట్రానికో వచ్చిందంటే… ఆ సంస్థ ఆ రాష్ట్రంలో ఏం చేయనుంది? ఎంతమేర పెట్టుబడులు పెట్టనుంది? ఎంతమందికి ఉపాధి కల్పించనుంది?.. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన తాజా ఒప్పందం వీటికి అతీతం. సింగిల్ పైసా పెట్టుబడి లేదు. ఒక్కరికి కూడా ఉపాధి దక్కదు. స్థానిక ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. ఈ లెక్కన గేట్స్ ఫౌండూషన్ తో ఏపీ ఒప్పందం ఓ సరికొత్త ఒప్పందమే. దీని ఫలితాలు వచ్చాక గానీ.. దీని ప్రత్యేకత ఏమిటన్నది జనానికి అర్థం కాదనీ చెప్పాలి.

This post was last modified on March 27, 2025 9:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago