వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి విపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే అతి కష్టంమీద బెయిల్‌పై బయటకు వచ్చారు. అది కూడా అనేక షరతులకు లోబడి కోర్టు.. ఆయనకు షరతులు ఇచ్చింది. ఇక, బెయిల్ రాకుండా.. మగ్గుతున్నవారు కూడా ఉన్నారు.
వీరిలో కీలక నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్‌కుమార్ వంటివారు ఉన్నారు. వీరు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియని ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. తాజాగా మంగళవారంతో వంశీకి ఉన్న రిమాండ్ గడువు ముగిసింది. దీంతో ఆయన ఇక, తనకు బెయిల్ దక్కుతుందని సాయంత్రం వరకు ఎదురు చూశారు. కానీ, విజయవాడ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని వచ్చే నెల 8వ తేదీ వరకు మళ్లీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ పరిణామాలతో వంశీ సహా ఆయన అనుచరులు పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ఇన్నికష్టాల్లో ఉంటే.. కనీసం న్యాయసాయం కూడా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నాయకుల నుంచి కనీసం పరామర్శ కూడా కరువైందని.. అప్పుడెప్పుడో.. ఒకసారి సీఎం జగన్ వచ్చి వెళ్లడమే తప్ప. ఆ తర్వాత తమ మొహం కూడా చూడలేదన్నది వంశీ ఆవేదన. ఇక, ఇదే కేసులో అరెస్టయిన.. మరికొందరు కూడా ఇదే ఆవేదన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు కూడా బెయిల్ దక్కకపోవడం.. ఇప్పటికే రెండు మాసాలుగా జైల్లోఉండడంతో వంశీ అయితే.. నిప్పులు చెరుగుతున్నట్టు సమాచారం.
ఇక, సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్ పరిస్థితి పెనంపై నుంచిపొయ్యిలో పడినట్టు అయింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు పెట్టాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో విచారణ పరిధిలో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకుంటే.. ఆయన కు మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అంతేకాదు.. రాజమండ్రి జైలు అధికారుల ముందు నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోవడాన్ని కూడా కోర్టు తీవ్రంగా తీసుకుంది. ఇలాంటి సమయంలోతనకు న్యాయసాయం అందించేందుకు బలమైన న్యాయవాదులను నియమించేందుకు పార్టీ ప్రయత్నాలు చేయడం లేదని బోరుగడ్డ తన వారితో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చేసింది ఎవరికోసం.. నా కోసమా? అని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తంగా జైలు పక్షలు జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
This post was last modified on March 25, 2025 10:19 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…