Political News

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి ఇబ్బందులు పడ్డామన్న మాటను ఆ ఉద్యోగి తన అక్షరాలతోనే కళ్లకు కట్టారు. అక్కడితోనూ ఆయన ఆగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చేస్తున్న న్యాయాన్ని కూడా ప్రస్తావించారు. కూటమి న్యాయం వల్ల జరుగుతున్న లాభాన్నీ సోదాహరణంగా వివరించారు. నాడు అణచివేతతోనే ప్రచారాన్నిహోరెత్తిస్తే.. నేడు ఇంత మంచి చేస్తూ కనీస ప్రచారాన్ని ఎందుకు చేసుకోవట్లేదని ఆ ఉద్యోగి నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. రాఘవ రామిరెడ్డి అనే ఉద్యోగి ఫేస్ బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

రాఘవ రామిరెడ్డి ఏ శాఖ ఉద్యోగో, ఎక్కడ ఫనిచేస్తున్నాన్న విషయాలైతే తెలియవు గానీ… ఆయన పెట్టిన పోస్టు మాత్రం అందరినీ ఆలోచింపజేసేదిగానే ఉంది. వైసీపీ హయాంలో నిజంగానే వేతనాలు ఏ నెల కూడా ఫస్ట్ తారీఖున పడిన దాఖలానే లేదు. కొన్ని సందర్భాల్లో అయితే… ఏకంగా నెలాఖరున కూడా వేతనాలు ఇచ్చారు. వేతనాల సంగతి అలా ఉంచితే.. ఉద్యోగుల ఫీఎఫ్ గానీ, ఇతరత్రా బెనిఫిట్స్ కు సంబందించిన నిధులు సక్రమంగా జమ అయ్యేవి కాదు. సర్కారు తన వాటాను జమ చేసే మాట అటుంచితే… ఉద్యోగుల జీతాల్లోంచి జమ అవుతున్న నిధులను వాడేసుకుంది. వెరసి తన వాటాను కూడా కలపుకుంటే.. ఈ బకాయిలు వేల కోట్లకు చేరాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బకాయిలు తీరేవి కావన్న భావనకు ఉద్యోగలు వచ్చేశారు.

ఇలాంటి దర్భర పరిస్థితుల కారణంగా కుమార్తె పెళ్లికో, కొడకు ఉన్నత చదువులకో అక్కరకు వస్తుందనుకున్న పీఎఫ్ వెక్కించేసింది. పీఎఫ్ అందలేదని శుభకార్యాలు ఆగవు కదా. పీఎఫ్ లో నిధులు ఉండి కూడా అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను తోటి ఉద్యోగులకు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో? ఇదేమిటండీ… ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? అంటూ ఉద్యోగ సంఘాల నేతలను అడిగితే… వారి పరిస్థితిని తెలుసుకుని భయకంపితులు అయిన ఉద్యోగులు ఇంకెందరో? అన్యాయం జరిగిందని, జరుగుతోందని తెలుసు. కానీ ప్రశ్నించడానికి ధైర్యం లేదు. ప్రశ్నిస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అన్నీ తెలిసే ఉద్యోగులు పంటి బిగువున బాధల భరిస్తూ కాలం వెళ్లదీశారు.

అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వేతనాల చెల్లింపు ఓ దారిలో పడింది. ప్రతి నెలా ఐదో తారీఖలోగానే వేతనాలు అందుతున్నాయి. ఇక స్థాయికి మించిన బకాయిలను చెల్లించే ప్రక్రియకు కూటమి సర్కారు దశల వారీగా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఫలితంగా గత సంక్రాంతికి కొంత నిధులు విడుదలయ్యాయి. తాజాగా మరిన్ని నిధులు కూడా విడదల అయ్యాయి. ఇంకా కొద్దో, గొప్పో బకాయిలు ఉన్నా… అవన్నీ త్వరలోనే తీరిపోతాయన్న భావన అయితే ఉద్యోగుల్లో కలిగింది. మొత్తంగా గతంలో ఎంత నిర్భీతిగా పనిచేసేవారో..ఐదేళ్ల నరకప్రాయ పరిస్థితుల తర్వాత కూటమి పాలనలో ఉద్యోగులు నిశ్చింతగా పనిచేసుకుంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వింటుంది… పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది అన్న భావన వారిలో వ్యక్తమవుతోంది.

అటు సామాన్య ప్రజలు, ఇటు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సదరు ఉద్యోగి… ఇంత మంచి చేస్తూ కూడా ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అయితే చిల్లిగవ్వ ఇచ్చినా… బటన్ నొక్కుతన్నామంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది కదా… మరి మీరు ఇన్నేసి వేల కోట్లు… ఇన్నేసి వర్గాల ప్రజలకు సాయం చేస్తూ కూడా కనీస ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. మొత్తం ప్రభుత్వం తరఫున కాకున్నా సంబంధిత శాఖల మంత్రుల స్థాయిలో కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

This post was last modified on March 25, 2025 5:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుతో వెంకీ సినిమా ఎందుకు అవ్వలేదు?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు…

4 hours ago

బాబు పథకం దేశానికే ఆదర్శం అయ్యింది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ…

5 hours ago

విక్రమ్ సినిమాకు ఇలాంటి పరిస్థితా

ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…

6 hours ago

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి…

6 hours ago

జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు ప‌క్షులు!

వైసీపీ త‌ర‌ఫున గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. పార్టీని, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేస‌మ‌యంలో అప్ప‌టి…

8 hours ago

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…

8 hours ago