Political News

త‌మ్మినేని డిగ్రీ వివాదం.. క‌దిలిన విజిలెన్స్‌

వైసీపీ నాయ‌కుడు, అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వంతు వ‌చ్చింది. ఆయ‌న గ‌తంలో ఎన్నికల అఫిడ‌విట్‌లో స‌మ‌ర్పించిన డిగ్రీ స‌ర్టిఫికెట్లు.. నకిలీవ‌ని, ఆయ‌న ప‌దో త‌ర‌గ‌తి కూడా పాస్ కాలేద‌ని.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఆమ‌దాలవ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుత ఎమ్మెల్యే, తమ్మినేని బావ‌మ‌రిది కూన ర‌వి కుమార్‌.. ఈ విష‌యంపై ప‌ట్టుబ‌ట్టారు. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న‌పై డిగ్రీ స‌ర్టిఫికెట్ల‌కు సంబంధించి భారీ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

పైగా.. ఆయ‌న ఊరూ పేరు లేని సంస్థ నుంచి డాక్ట‌రేట్ కూడా చేస్తున్న‌ట్టు చెబుతున్నార‌ని అప్ప‌ట్లోనే కూన విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌ను వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తాజాగా ఈ వ్య‌వ‌హారాన్ని వెలికి తీశారు. మ‌రోసారి ప్ర‌భుత్వానికి కూన ఈ విష‌యంపై విన్న‌పాలు స‌మ‌ర్పించారు. అసెంబ్లీ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి అబ‌ద్ధాలు ఆడిప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై విచార‌ణకు ఆదేశించాల‌ని కూన ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం తాజాగా విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించింది. త‌మ్మినేని విద్యార్హ‌త‌లు, ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్న అంశాలు.. వంటివాటిని ప‌రిశీలించ‌నుంది. అదేవిధంగా ఆయ‌న చ‌దివిన పాఠశాల‌, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో ఆయ‌న‌కు వ‌చ్చిన మార్కులు, అలానే ఏ కాలేజీ నుంచి ఆయ‌న డిగ్రీ చేశారు. ఆయ‌న‌కు ఏ సంస్థ డాక్ట‌రేట్ చేసే అవ‌కాశం ఇచ్చింద‌న్న అంశాల‌పై కూపీ లాగ‌నున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల మేర‌కు 15 రోజుల్లోనే విజిలెన్స్ అధికారులు త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అనంత‌రం.. ఈ నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. త‌మ్మినేని ఇప్ప‌టికీ.. తాను డాక్ట‌రేట్ చేస్తున్నాన‌ని.. ఎవ‌రైనా విచారించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

This post was last modified on March 24, 2025 3:00 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

4 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

6 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

6 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

6 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

10 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

10 hours ago