వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించినట్లుగా సమాచారం. ఇలా జగన్ సొంత జిల్లాలో జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను వేరే రాష్ట్రంలోని శిబిరానికి తరలించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా… కడప జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉంటే.. వాటిలో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. నాడు విపక్షంలో ఉన్న టీడీపీకి సింగిల్ సీటు మాత్రమే దక్కింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకేసారి నలుగురు జడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఫలితంగా టీడీపీ బలం 5కు చేరింది. వైసీపీ బలం 45కు తగ్గింది. ఇక ఎన్నికల్లో జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూటమి పార్టీలే గెలిచాయి. ఫలితంగా జడ్పీ చైర్మన్ ఎన్నికలో కీలకంగా పరిగణిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య కూడా వైసీపీకి భారీగా తగ్గిపోగా… టీడీపీకి అనూహ్యంగా పెరిగింది.
అదే సమయంలో మొన్నటి ఎన్నికల దాకా కడప జడ్పీ చైర్మన్ గా కొనసాగిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఎన్నికల్లో రాంజేపట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కడప జడ్పీ చైర్మన్ గా కొత్తగా నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనుకోకుండా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ వ్యూహం రచించింది. అందులో భాగంగా తమ వైపు చూస్తున్న వైసీపీ జడ్పీటీసీలతో చర్చలు జరిపింది. వారిలో చాలా మంది పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలోగా జడ్పీటీసీల్లో చాలా మంది పార్టీ మారడం ఖాయమైపోయింది.
ఈ విషయం తెలిసినంతనే అప్రమత్తమైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ జడ్పీటీసీలను బెంగళూరు క్యాంప్ కు తరలించినట్లు సమాచారం. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో వారిని అవినాశ్ ఎలా కాపాడుకుంటారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ వైసీపీ జడ్పీటీసీలతో టీడీపీ చర్చలు పూర్తి అయిపోయాయని.., ఇలాంటి నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను అవినాశ్ బెంగళూరు క్యాంప్ నకు తరలించినా పెద్దగా ఫలితం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన జగన్ గడపపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనని చెప్పక తప్పదు.
This post was last modified on March 24, 2025 2:22 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…