రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ను బీజేపీ వాడుకుంటోందా? ఆయన బీజేపీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నానని చెబుతున్నా.. అంతర్గత వ్యవహారాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయా? వచ్చే కొన్ని నెలల్లోనే జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీ ఆయనను చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటోందా? అంటే..జాతీయ మీడియా కథనాలు ఔననే ఆన్సర్ చెబుతున్నాయి. ప్రధానంగా బిహార్‌లో బీజేపీ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇది నితీష్‌కు ఎలానూ ఇష్టం ఉండదు. ఎందుకంటే.. ఎన్డీయే భాగస్వామిగా ఆయన ఉన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి, బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి పక్కాగా మద్దతు ఇస్తున్నాయి. అయినప్పటికీ.. రాజకీయాలు రాజకీయాలే కాబట్టి.. బీహార్‌లో పాగా వేయాలన్నది బీజేపీ నేతల వ్యూహం. ఈ క్రమంలో తమ చేతికి మట్టి అంటకుండా.. పీకేను వాడుకుంటోందన్న చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. వాస్తవానికి కూటమి పార్టీల్లో ఉన్న బీజేపీ.. నితీష్‌కు మద్దతుగా నిలవాలి. నిలుస్తుందని కూడా నితీష్ ఆశించడం తప్పుకాదు. కానీ, జరుగుతున్న పరిణామాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి.
“మా ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. వాటిని పనికిరాని నాయకుడు(పీకే) ఒకరు ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నాడు. ఇది ఎలా జరుగుతోంది? అంతా గోప్యం. అంతా రాజకీయ విన్యాసం” అని నితీష్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న మంత్రి ఒకరు జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. అంటే.. పీకే వేస్తున్న అడుగులు, నితీష్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుకూడా.. బీజేపీ కనుసన్నల్లోనే సాగుతోందన్నది నితీష్‌కు కూడా తెలుసునన్న చర్చసాగుతోంది. అయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు దీనిని బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇదిలావుంటే.. పీకే రెండు మార్గాల్లో నితీష్‌ను డైల్యూట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1) నితీష్ వయసు, వృద్ధాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. 2) నితీష్ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని అంటున్నారు. అయితే.. ఈ రెండో విషయానికి వస్తే.. ఆయన ఎక్కడా బీజేపీ నేతలను టార్గెట్ చేయడం లేదు. కేవలం నితీష్ కు చెందిన నాయకులు, జేడీయూ కు చెందిన నాయకులను మాత్రమే కార్నర్ చేస్తున్నారు. ఇక, బీజేపీ కి బలం ఉన్న నియోజకవర్గాలపై కూడా పీకే దృష్టి పెట్టడం లేదు. కేవలం నితీష్ వర్గానికి బలం ఉన్న నియోజకవర్గాల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. సభలు పెడుతున్నారు. సో.. ఈ పరిణామాలను అంచనా వేస్తున్న జాతీయ మీడియా.. పీకే వెనుక బీజేపీ బలంగా పనిచేస్తోందని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
This post was last modified on March 24, 2025 10:43 am
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవలేదు. ఎమ్మెల్యేల నుంచి నాయకుల వరకు.. సినీరంగం నుంచి ఇతర కళాకారుల దాకా అనేక…
స్టార్ క్యాస్టింగ్ లేకుండా కంటెంట్ ని నమ్ముకుని కొత్త దర్శకుడికి అవకాశమిచ్చిన నిర్మాత నాని దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని…
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్‌లో మరోసారి ధోని మెజిక్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువ ప్రభావం చూపించిన…
శాసన మండలిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదా? వైసీపీ తరఫున గతంలో మండలిలో చక్రం తిప్పిన నాయకులు.. తర్వాత…
ఈ వారం విడుదల కాబోతున్న స్ట్రెయిట్ సినిమాల్లో బడ్జెట్ పరంగా రాబిన్ హుడ్ పెద్దది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో…
దేశంలో డీలిమిటేషన్ జరిగితే(పార్లమెంటు స్థానాల పునర్విభజన) అది దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ లకు తీవ్ర నష్టం…