వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు అయ్యింది. ఎలాంటి తప్పు చేయని ఓ కంపెనీని కేవలం వసూళ్ల కోసం టార్గెట్ చేసిన రజినీ… దాని యాజమానుల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూళ్లను బలవంతంగా లాక్కున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రజినీ పాత్రను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఆమె పాత్రను నిర్ధారించి కేసు నమోదు చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ ను టార్గెట్ చేసిన రజినీ అండ్ కో.. దాని యజమానుల నుంచి రూ.5 కోట్ల వసూలుకు యత్నించింది. కంపెనీలో అక్రమాలు జరిగాయో, లేదో తెలియదు గానీ…తన నియోకజవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందేనని రజినీ కంపెనీ యజమానులకు తేల్చి చెప్పారు. అందుకు కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో వెంటనే సదరు కంపెనీపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ హోదాలో ఐపీఎస్ అదికారి పల్లె జాషువా తన సిబ్బందితో కలిసి పాలుపంచుకున్నారు.
ఈ దాడులకు కూడా కంపెనీ యాజమాన్యం బెదిరకపోగా… జాషువా నేరుగా కంపెనీ యజమానులకు ఫోన్ చేసి రజినీ చెప్పినట్లు వినకపోతే… రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వారు రజినీ కలిశారు. ఆమె సూచన మేరకు రజినీ పీఏను కలిశారు. చర్చల్లో భాగంగా రూ.5 కోట్లకు బదులుగా రూ.2.20 కోట్లకు ఇరువర్గాలు అంగీకరించాయి. ఇందులో రూ.2 కోట్లను రజినీకి చెల్లించే విధంగా ఆ మొత్తాన్ని రజినీ మరిది గోపి చేతిలో పెట్టారు. ఆ తర్వాత గోపికి రూ.10 లక్షలు, జాషువాకు రూ.10 లక్షలు సమర్పించుకున్నారు.
ఇదిలా ఉంటే… నాడు ఈ వసూళ్లకు సంబంధించి జాషువా…రజినీ చేతిలో ఆయుధంగా పనిచేశారు. రజినీ చెప్పినట్లుగా నడుచుకున్నారు. రజీని ఏం చేయమంటే అదే చేశారు. తాను ఓ ఐపీఎస్ అధికారిని అని, విజిలెన్స్ శాఖలో కీలకంగా పని చేస్తున్నానన్న విషయాన్నే ఆయన మరిచిపోయారు. విజిలెన్స్ శాఖ దాడులు చేస్తే… ఆ సమాచారాన్ని ముందుగా ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. దాడుల తర్వాత నివేదికనూ పంపుతారు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఈ రెండు పనులను జాషువా ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఈ కారణంగానే ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో ఏ1గా రజినీ, ఏ2గా జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజినీ పీఏ రామకృష్ణ పేర్లను చేర్చారు.
This post was last modified on March 23, 2025 11:05 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…