టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. సాదాసీదా రాజకీయాలు చేసే వారికి అసలు ఈ ఊహే తట్టదని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
నిజమే… ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో విడుదలయ్యే ఫలితాలు ఓ సారి సిట్టింగ్ పార్టీకే పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు దక్కితే… మరికొన్ని సార్లు అప్పటిదాకా విపక్షాలుగా కొనసాగిన పార్టీల చేతులకు ఆ పగ్గాలు దక్కుతాయి. ప్రభుత్వ పగ్గాలు పట్టుకునే పార్టీలు మారవచ్చు గానీ… ప్రభుత్వాలు అయితే మారవు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా గానీ… దానిని ఒప్పుకునేందుకు మాత్రం చాలా మంది సిద్ధపడరు. అది వారిలోని నారో మైండెడ్ నెస్ కు నిదర్శనమని చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వం మారదు కదా. అందుకే కదా…గత ప్రభుత్వం చేసిన అప్పులను ఆ తర్వాత వచ్చే పార్టీల ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. గత పార్టీ ప్రభుత్వాలు పెండింగ్ పెట్టిన బిల్లులను ఆ తర్వాత వచ్చే పార్టీ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా.
శుక్రవారం కూడా ఏపీలో గత ఐధేళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి దిగిపోతే… ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వాటిని చెల్లిస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద రూ.788 కోట్లను కూటమి సర్కారు చెల్లించింది. తాజాగా శుక్రవారం ఈ బకాయిల్లో మరో రూ.600 కోట్లను విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రభుత్వం, రాజకీయం… వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహాలో ముందుకు సాగే నేతలు తిరుగు లేని నేతలుగా ఎదిగి తీరుతారని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. ఆ దిశగానే లోకేశ్ కూడా పయనిస్తున్నారని చెప్పక తప్పదు.
This post was last modified on March 22, 2025 11:46 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…