Political News

ఆ సామాజిక వ‌ర్గంపై ఆశ‌లు ఆవిరి.. జ‌గ‌న్ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

రాజ‌కీయాల్లో నాయ‌కుల ప్ర‌తిభ‌, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివ‌రాఖ‌రుకు.. సామాజిక వ‌ర్గాల ద‌న్ను, వారి మ‌ద్ద‌తు లేకుండా రాజ‌కీయాలు చేయ‌లేర‌న్న విష‌యం తెలిసిందే. ఆది నుంచి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. గ‌త 20 ఏళ్ల రాజ‌కీయాల‌ను చూసుకుంటే.. ఏపీలో సామాజిక వ‌ర్గాల బ‌లం ఎటు వైపు ఉంటే ఆ పార్టీనే అధికారం ద‌క్కించుకుంటున్న ప‌రిస్థితిఉంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయా వ‌ర్గాలు నేత‌ల త‌ల‌రాత‌ల‌ను నిర్ణ‌యిస్తున్నాయి.

అందుకే.. ఎవ‌రిని ఎంత ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. సామాజిక వ‌ర్గాల‌ను లాలించ‌క‌.. ప్రేమించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల వ్య‌వ‌హారం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో కాపులు టీడీపీకి వ్య‌తిరేకంగా మారారు. అలాగ‌ని.. కాపు నాయ‌కుడు స్థాపించిన జ‌న‌సేన వైపు కూడా పెద్ద‌గా మొగ్గు చూప‌లేదు. నేరుగా వైసీపికి అనుకూలంగా ప‌నిచేశారు. కానీ, 2024కు వ‌చ్చేసరికి మాత్రం గుండుగుత్త‌గా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

అంటే.. 2019లో త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న కాపులు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి దూర‌మ‌య్యార‌నే విష‌యం జ‌గ‌న్ గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం మానేశారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసిన ఫ‌లితంగానే కాపులు దూర‌మ‌య్యార‌న్న వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం మానేశారు.

అంతేకాదు.. తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను మండ‌లికి పంపించారు. ప్ర‌తిప‌క్షనాయ‌కుడిగా కూడా ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఎన్ని చేసినా కాపుల నుంచి పెద్ద‌గా స్పంద‌న వైసీపీ వైపు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. కాపు నాయ‌కుడు ఆళ్ల నాని పార్టీ నుంచి దూరం కావడం ఆయ‌న‌ను క‌నీసం బుజ్జ‌గించ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు కాపుల‌ను దూరంగానే ఉంచాయ‌న్న చ‌ర్చ ఉంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి కాపులు ఇప్ప‌ట్లో మొగ్గు చూపే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు కీలక కాపు నాయ‌కులు కూడా సైలెంట్ అయిపోయారు.

This post was last modified on March 20, 2025 4:06 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

46 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago