బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎఫ్ ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు హరీష్‌రావును ఏ1గా పేర్కొంటూ గతంలో కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టి వేయాలని.. రాజకీయ కక్ష సాధింపుల క్రమంలోనే తనపై కేసు నమోదైందని పేర్కొన్నారు.
ఈ కేసులో హరీష్ రావుతోపాటు రాధాకిషన్ రావుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇరువురిపైనా ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. ఏ ఆధారాలతో కేసు నమోదు చేశారని ప్రశ్నించింది. దీనికి కొంత సమయం కావాలని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం సరికాదని పేర్కొంటూ కోర్టు సదరు ఎఫ్ ఐఆర్‌ను కొట్టి వేసింది.
బీఆర్ ఎస్ హయాంలో 2023 ఎన్నికలకుముందు ప్రముఖ నాయకులు, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిలో నేరుగా పోలీసుల ప్రమేయం ఉందన్న వాదన కూడా వినిపించింది. దీనిపై విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలువురు అధికారులపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందని తెలియడంతో వారిపైనా కేసుల నమోదుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే చక్రధర్ గౌడ్ ఆరుమాసాల కిందట హరీష్ రావు సహా.. రాధాకిషన్‌రావులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:06 pm
ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం…
టాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ఒక హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో..…
దళిత సామాజిక వర్గంలో బీసీల మాదిరే చాలా కులాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఎస్సీలుగా పరిగణిస్తున్నాం. బీసీల మాదిరే తమకూ…
హీరోలన్నాక ఫ్లాపులు సహజం. కాకపోతే వరసగా వస్తేనే ఇబ్బంది. నితిన్ కు ఈ సమస్య ఎదురయ్యింది. ప్రతిసారి ఒక హిట్టు…
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్…