వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా“ అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్.. మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక చాలానే కుట్ర జరిగిందన్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని.. అనేక బాధలు పడ్డానని సునీల్ చెప్పారు. కానీ, తననే బెదిరిస్తున్న పరిస్థితి ఎదురవుతోందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్ వెల్లడించారు. తాను భయ పడుతూ ఎన్నాళ్లు బతకాలని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వివేకా దారుణ హత్యకు కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే చెప్పనున్నట్టు తెలిపారు. బెయిల్‌పై ఉన్న తనకు పులివెందులలోని వైసీపీ నాయకులు, వారి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణభయం ఉందన్నారు. వారి వేధింపులు, బెదిరింపులను భరించలేక పోతున్నట్టు తెలిపారు. చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా.. తాను ఇలానే ప్రాణ భయంతో బతకాల్సివచ్చిందని సునీల్ యాదవ్ వెల్లడించారు.
కాగా.. వివేకా కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సైతం కొందరి నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు.. ఇటీవల కూడా దస్తగిరి భార్యపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసిన కొట్టారు. దస్తగిరిని లేపేస్తామంటూ.. బెదిరింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ సైతం తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:02 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…