కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న రాజాసింగ్ వ్యవహారం నిత్యం ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ముస్లింలు అత్యధికంగా కలిగిన పాత బస్తీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ చుట్టు నిత్యం వివాదాలే తిరుగాడుతూ ఉంటాయి. తాజాగా ఓ విషయం రాజాసింగ్ ను మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. భద్రత కారణాల రీత్యా బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగించమని పోలీసులు చెబితే… అందుకు ససేమిరా అన్న రాజా సింగ్… తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ కోరి ఖాకీలకు షాకిచ్చారు.
హిందూ భావజాలాన్ని బలంగా వినిపించే వ్యక్తుల్లో రాజాసింగ్ ముందు వరుసలో ఉంటారు. ఇటీవలే రంగుల కేళీ హోలీ సందర్భంగా పోలీసులు విధివిధానాలను జారీ చేస్తే…అనాదిగా హోలీ వేడుకలను జరుపుకుంటున్న హిందువులు ఇప్పుడు పోలీసులు చెప్పినట్లు నడుచుకోవాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ కు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో మంగళ్ హట్ పోలీసులు రాజిసింగ్ ను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా బయటకు వస్తే… బుల్లెట్ ప్రూఫ్ కారు లేనిదే రావద్దని, భద్రతను కూడా 1 ప్లస్ 4తోనే బయటకు రావాలని సూచించారు. ఈ మేరకు మంగళ్ హట్ పోలీసులు ఆయనకు అధికారికంగానే నోటీసులు జారీ చేశారు.
ఈ వేకప్ కాల్స్ ను రాజాసింగ్ చాలా లైట్ గా తీసుకున్నారు. తన నియోజకవర్గం మొత్తం చిన్న చిన్న గల్లీలతో కూడుకుని ఉంటుందని..అందులో బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగించడం సాధ్యం కాదని పోలీసులకు తేల్చి చెప్పేశారట. అంతేకాకుండా తాను గన్ లైసెన్స్ కోసం చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన రాజాసింగ్.. ముందుగా దాని సంగతేంటో తేల్చండని కోరారట. బుల్టెల్ ప్రూఫ్ కారు తాను వాడనని… తన ఆత్మరక్షణ కోసం కోరిన గన్ లైసెన్స్ ను మాత్రం తనకు ఇవ్వాలంటూ కోరిన రాజాసింగ్ పోలీసులను షాక్ కు గురి చేశారు. మరి రాజాసింగ్ ప్రతిపాదనపై పోలీసులు ఎలా స్పందిస్తారోనన్న దానిపై ఆసక్తి నెలకొంది.
This post was last modified on March 20, 2025 12:36 pm
గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు…
ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11…
రాజకీయాల్లో నాయకుల ప్రతిభ, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివరాఖరుకు.. సామాజిక వర్గాల దన్ను, వారి మద్దతు లేకుండా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్…
సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా ఒక సినిమా ప్రమోషన్ ఎలా ఉండాలో సూచించే స్థాయికి వెళ్ళిపోయింది.…
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్నా... సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు పరిధిలో హార్డ్…