ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే.
ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత కూడా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని ఆయన చేసిన కామెంట్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.
కరోనా విలయంతో నిజంగానే ఇప్పుడు మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోక తప్పదన్న వాదనలు అన్ని కోణాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖానికి మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం ఇకపై మన దైనందిన జీవితాల్లో భాగం కాక తప్పదన్న వాదన అందరూ అంగీకరిస్తున్నదే.
ఇలాంటి తరుణంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని పక్కాగా అమలు చేస్తోందని మూర్తి కితాబిచ్చారు. అదే సమయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కాగానే అమలు చేస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా దేశంలో పాజిటివ్ గా తేలిన వారిలో కేవలం 0.25 శాతం మందే చనిపోతున్నారని, 137 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఈ శాతం మరణాల రేటు అంత తక్కువేమీ కాదని కూడా మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ మరణాల శాతం దేశంలో 0.7 శాతంగా ఉండగా… కరోనా మరణాల శాతం 0,25 శాతంగా ఉంటున్నాయంటే… ఆ వైరస్ ఎంత ప్రమాదకారి అన్న విషయం ఇట్టే తేలిపోతుందని కూడా మూర్తి పేర్కొన్నారు.
అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనా ఉధృతి తగ్గాక కూడా ఈ వైరస్ కు మనల్ని మన దూరంగా ఉంచుకోవాలంటే మాస్కు, కళ్లద్దాలు, గౌన్లు వాడక తప్పదని, ఈ తరహా జీవన విధానం 12 నుంచి 13 నెలలు కొనసాగక తప్పదని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని మూర్తి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… మూర్తి మాదిరే కరోనాతో సహజీవనం చేయక తప్పదన్న మాటను ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట కూడా వినిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 30, 2020 12:12 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…