టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగగా… దానికి హాజరైన పవన్… కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత… చంద్రబాబుతో విడిగా భేటీ అయ్యారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యేకంగా భేటీ అయిన తీరుపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుందామని ఇదివరకే చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబుతో పవన్ భేటీ కావడంతో దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకేననే చర్చ జరుగుతోంది.
గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా… చంద్రబాబు, పవన్ లు సభ బయటకు వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఆఫీస్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. నాడు నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్బంగా పవన్ ప్రతిపాదనను తిరస్కరించిన చంద్రబాబు… నాగబాబును రాజ్యసభకు కాకుండా శాసన మండలికి పంపిద్దామని… ఆ తర్వాత ఆయనను నేరుగా కేబినెట్ లోకి తీసుకుందామని ప్రతిపాదించారు. బాబు ప్రతిపాదన నచ్చడంతో పవన్ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత బాబు చెప్పినట్లుగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం కల్పించారు. నాగబాబు ఏకగ్రీవంగా మండలికి ఎన్నిక కూడా అయ్యారు.
మరి బాబు చెప్పిన ప్రకారం నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాల్సి ఉంది కదా. అదే సమయంలో కేబినెట్ లో ఖాళీలు, పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై ఇప్పుడు జోరుగానే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో కేబినెట్ భేటీ ముగియగానే.. బాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటుగా ఆయనకు ఏ శాఖ కేటాయించాలి?.. మంత్రిమండలిలో మార్పులుచేర్పులపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల గురించి కూడా బాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on March 17, 2025 9:09 pm
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…