కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా… వాటి ద్వారా దాదాపుగా రాష్ట్ర యువతకు 4 లక్షల మేర ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా గురువారం జరిగిన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం మరిన్ని పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పెట్టుబడుల్లో ఏపీ నుంచి వైసీపీ దెబ్డకు పారిపోయిన లులూ గ్రూప్ తిరిగి ఏపీలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో కొత్తగా సిమెంట్ రంగంలో దేశంలోనే పేరెన్నికగన్న కంపెనీగా గుర్తింపు పొందిన దాల్మియా కంపెనీ రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది.
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రూ.1,21,659 కోట్ల మేర పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోకి మొత్తంగా 10 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 80,104 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వీటితో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఇక రాష్ట్ర యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు కూదా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం నెల వ్యవధిలోనే రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు తీర్మానించారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఆయా రంగాల్లో శిక్షణలతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ఇక విశాఖలో భారీ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అదే సమయంలో కడప జిల్లాలో దాల్మియా స్టీల్స్ కంపెనీ ఓ బారీ సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.
This post was last modified on March 14, 2025 8:56 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…