వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ కోర్టుల్లోనూ ఆయనకు బెయిళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని… కోర్టు నిర్దేశించిన మేరకు జామీనులు సమర్పించి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో సతమతం అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పోసానికి ఎట్టకేలకు కాస్తంత ఊరట లభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగారంటూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16 దాకా పోలీసు కేసులు నమోదు అయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు అయిన కేసులో రాజంపేట పోలీసులు గత నెల హైదరాబాద్ కు వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టు రిమాండ్ కు ఆదేశించగా… పోలీసులు రాజంపేట జైలుకు తరలించారు. అక్కడికి వచ్చిన నరసరావు పేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఆపై గుంటూరు జైలుకు వెళ్లిన పోసానిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.
అయితే ఎక్కడికక్కడ కేసులు నమోదు కావడంతో ఆయా కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ వచ్చిన పోసాని.. నేరుగా హైకోర్టులోనూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలో తొలుత రాజంపేట కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే పోసాని వేరే జిల్లాల పోలీసుల అదుపులోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జైలు నుంచి విడుదల సాధ్యం కాలేదు. సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కోర్టు కూడా పోసానికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కోర్టులు రెండే ఒకే రోజు బెయిల్ మంజూరు చేశాయి. ఇక మిగిలిన కేసుల్లో పోసానికి నోటీసులు ఇచ్చి స్టేట్ మెంట్లు రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 4 కోర్టుల్లో బెయిల్ తెచ్చుకున్న పోసాని.. ఆయా కోర్టులు పేర్కొన్న మేరకు జామీనులు సమర్పించి బుధవారం కర్నూలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on March 11, 2025 6:25 pm
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి…