తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్న అద్దంకి దయాకర్ కు ఓ సీటును కేటాయించిన హస్తం పార్టీ… ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చేసింది. ఇక జనరల్ కేటగిరీలో ఏ ఒక్కరూ ఊహించనట్లుగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆశావహుల జాబితాలో అస్సలు కనిపించని రాములమ్మ…ఏకంగా టికెట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి ఎన్నిక లాంఛనమేనని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే…ఈ జాబితాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కాంగ్రెస్ లోనే కాకుండా టీడీపీలో ఉన్న సమయంలోనూ రేవంత్, నరేందర్..మంచి స్నేహితులుగా కొనసాగారు. వాస్తవానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాతే వేం నరేందర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఆయన కొనసాగుతున్నారు. అయితే నరేందర్ కు మరింత ప్రాధాన్యం ఇద్దామన్న దిశగా రేవంత్ యోచించారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం రేవంత్ ప్రతిపాదనలకు ఓకే చెప్పలేదు. మరోవైపు పార్టీ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి..సంగారెడ్డికి చెందిన మరో సీనియర్ నేత కుసుమ కుమార్ కు ఎమ్మెల్సీ ఇప్పించేందుకు యత్నించారు. ఈ ప్రతిపాదనను కూడా అధిష్ఠానం పక్కకు పెట్టింది.
అద్దంకి దయాకర్, విజయశాంతిలు జనానికి బాగా తెలిసిన నేతలుగానే చెప్పాలి. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్ ను మాత్రం అంతగా ప్రాచుర్యం దక్కని నేతగానే చెప్పాలి. నల్లగొండ జిల్లా జనానికి తప్పించి మిగిలిన ప్రజలకు అంతగా పరిచయం లేని శంకర్… పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ అధిష్ఠానం వద్ద మంచి గుర్తింపు సంపాదించినట్లు సమాచారం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన, చేస్తున్న నేతలకు తప్పనిసరిగా మంచి గుర్తింపు దక్కాల్సిందేనన్న భావనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ కు ఈ భావనే టికెట్ దక్కేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 9, 2025 8:39 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…