Political News

వారంతా లేన‌ట్టే..

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌(శ్రీశైలం కుడి కాల్వ‌) టన్నెల్‌లో గ‌త నెల 22న జ‌రిగిన ప్ర‌మాదంలో చిక్కుకు పోయిన‌.. ఆరుగురు కూలీలు, ఇద్ద‌రు ఇంజ‌నీర్లు లేన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. ఆనాడు జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో వారంతా లోప‌లే చిక్కుకుపోయారు. అయితే.. వీరిని కాపాడేందుకు జాతీయ‌, అంత‌ర్జా తీయ స్థాయి సంస్థ‌ల స‌హ‌కారం తీసుకుని ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే.. ఎవ‌రి జాడా క‌నిపించ‌లేదు. తాజాగా మ‌నిషి శ‌రీరానికి సంబంధించిన ఆనవాళ్లు కాంక్రీట్‌లో క‌నిపించిన‌ట్టు అధికారులు తెలిపారు.

దీంతో ఆ ఎనిమిది మంది ప‌రిస్తితి ఇలానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ భౌతిక దేహాలు క‌నిపించినా.. ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. తాజాగా టీబీఎంకు ఎడమ ప‌క్క‌న ఒక చేయిని స్నిఫ‌ర్ డాగ్స్ గుర్తించాయి. దీనిని అధికారులు వెలికి తీయించారు. అయితే.. మ‌రింత‌లోతుగా ప‌నిచేస్తేనే ఇత‌రుల ఆన‌వాళ్లు ల‌భిస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం క‌నిపించిన ఆన‌వాళ్లు ఆధారంగా కాంక్రీట్ మిశ్ర‌మంలో కార్మికులు కూరుకుపోయి ఉంటార‌ని భావిస్తున్నారు.

దీంతో కాంక్రీట్‌ను తొల‌గించేందుకు, కార్మికుల‌ను గుర్తించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికి ఘ‌ట‌న జ‌రిగి 16 రోజులు అయింద‌ని చెబుతున్నారు. దీంతో ఎవ‌రూ ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ట‌న్నెల్‌లో అణువ‌ణువునూ గాలిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు.. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు.. అడుగ‌డుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఊట నీరు పైకి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ప‌నులు చేప‌ట్ట‌డం దుశ్శాధ్యంగా మారుతోంద‌ని అంటున్నారు.

ఏదేమైనా.. 8 మంది ఆచూకీ విష‌యం అనుమాస్ప‌ద‌మేన‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌లు.. స‌ఫ‌లం అయినా.. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషంట్ డెడ్ అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారే స‌రికి స‌ర్కారు కూడా.. ఆవేద‌న‌లో మునిగిపోయింది. అయితే, బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని సీఎం గతంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on March 9, 2025 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

1 hour ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

2 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

2 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

3 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

4 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

5 hours ago