Political News

కూట‌మికి జోష్‌: న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సానుకూలం?

మ‌రో 12 రోజుల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. మొత్తం 5 స్థానాల‌ను కూట‌మి ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. న‌లుగురు ఎమ్మెల్యేల అవ‌స‌రం ఉంది. మొత్తం 175 మందిలో 168 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం అయితే.. త‌ప్ప‌.. గుండు గుత్త‌గా ఐదు స్థానాలు కూట‌మికి ద‌క్క‌డం సాధ్యంకాదు. కానీ, ప్ర‌స్తుతం 164 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. దీంతో మ‌రో నలుగురి కోసం కూట‌మి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

వీరు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలే అయి ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం.. మ‌రో పార్టీకి రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఓటేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వైపు..కూట‌మి నాయ‌కులు సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. న‌లుగురు ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకోగ‌లిగితే.. ఇక‌, ఐదు స్థానాల్లోనూ విజ‌యం ఖాయం. అయితే.. ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నేది ఇప్పుడుస‌స్పెన్స్‌గా మారింది. తాజాగా మారు తున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఆ న‌లుగురి వేట ముమ్మ‌రంగా సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీ తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న నియోజ‌క‌వ‌ర్గాలపై కూట‌మి ప్ర‌భుత్వం ఎక్కువ‌గా కాన్స‌న్‌ట్రేట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని కూడా తెలిసిం ది. గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. పార్టీ మార‌క‌పోయినా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పిన ప‌నులు చేస్తే.. తాను కూట‌మికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, మ‌రో ముగ్గురి విష‌యానికి వ‌స్తే.. వీరు కూడా రెడీ అన్న‌ట్టుగా సంకేతాలు వ‌చ్చాయ‌న్న చ‌ర్చ సాగుతోం ది. అయితే.. వీరిలో ఇద్ద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నార‌ని.. అంటున్నారు. పేర్లు బ‌య‌ట కు చెక్క‌క‌పోయినా.. గ‌తంలో వీరిపై కేసులు ఉన్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. ఇక‌, వైసీపీలో ఉన్నా.. ఈ ఇద్ద‌రు రెడ్డి నాయ‌కులు సైలెంట్ గా ఉంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. దీంతో మొత్తంగా.. ముగ్గురు క‌లిసి వ‌చ్చార‌న్న‌ది ఖాయం. అయితే.. ఇంకొక్క ఎమ్మెల్యే వ్య‌వ‌హారం తెలియాల్సి ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 9, 2025 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

1 hour ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

2 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

2 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

3 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

4 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

5 hours ago