Political News

టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాలు అంతా అధికారపక్షం వహిస్తున్నారు. అలాంటిది టీడీపీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లను రాచమల్లు తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. ఇటీవలే వైసీపిని వీడిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రాచమల్లు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో మొత్తం 41 వార్డులు ఉన్నాయి. గత మునిసిపల్ ఎన్నికల్లో 40 స్థానాలను నాటి అధికార వైసీపీ దక్కించుకోగా… ఒక్క స్థానాన్ని మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క సభ్యుడు కూడా వైసీపీలో చేరిపోవడంతో ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో టీడీపీ బలం జీరోకు పడిపోయింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటిదాకా ప్రొద్దుటూరులో వైసీపీ గాలి వీయగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చేసింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ మోస్ట్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి… రాచమల్లుకు హ్యాట్రిక్ దక్కకుండా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసబెట్టి 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే… చైర్మన్ పదవి టీడీపీకే దక్కేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన రాచమల్లు… టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే దిశగా వ్యూహాలు అమలు చేశారు. పార్టీని వీడిన కౌన్సిలర్లు తిరిగి వస్తే… సాదరంగా ఆహ్వానిస్తానని, వారిని మరింత మంచిగా చూసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చర్చలు ఫలించినట్లుగా.. ఆదివారం 8, 39,40 వార్డుల కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ.. రాచమల్లు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. 23గా ఉన్న వైసీపీ బలం 25కు చేరిపోయింది. ఫలితంగా ప్రస్తుతానికి ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత లక్ష్మిదేవికి పదవీ గండం అయితే తప్పిందనే చెప్పాలి.

This post was last modified on March 9, 2025 1:49 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

29 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago