Political News

పేర్ని నానిపై హైకోర్టు ఆగ్ర‌హం.. కానీ..!

వైసీపీ మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్ పేర్ని నాని వ్య‌వ‌హారంపై ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పేద‌ల‌కు ఇచ్చే బియ్యాన్ని దారి మ‌ళ్లించారంటూ.. పేర్ని కుటుంబంపై ఏపీ ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. పేర్ని ఫ్యామిలి వైసీపీ హ‌యాంలో సొంత‌గా గోడౌన్లు నిర్మించింది. దీనిలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. నిల్వ‌ల‌ను లెక్కించింది.

ఈ క్ర‌మంలోనే దాదాపు వేల కోట్ల రూపాయ‌ల రేష‌న్ బియ్యం పేర్ని స‌తీమ‌ణి పేరిట ఉన్న గోడౌన్ల‌లో మిస్స య్యాయి. అప్ప‌ట్లోనే స‌ర్కారుకు కోట్ల రూపాయ‌ల పెనాలిటీ రూపంలో చెల్లించారు. అయితే.. పెనాలిటీ క‌ట్టినా కేసులు కొన‌సాగుతాయ‌ని.. పేద‌ల బియ్యాన్ని దారి మ‌ళ్లించి వేల కోట్లు సొమ్ము చేసుకున్నార‌ని స‌ర్కారు అప్ప‌ట్లో తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలోనే పేర్ని నానిపైనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో పేర్ని ఏ-6గా ఉన్నారు. దీంతో త‌న‌ను పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావించారు.

ఈ క్ర‌మంలోనే చాలా రోజుల పాటు మీడియా ముందుకు రాకుండా త‌ప్పించుకుని తిరిగారు. గ‌త నెల ప్రారంభంలో ఈ వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశం అయింది. తాజాగా పేర్ని నాని.. హైకోర్టును ఆశ్ర‌యించి త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని పోలీసులు అరెస్టు చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై ప‌లుమార్లు విచారించిన హైకోర్టు.. తాజాగా పేర్ని నానికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. అయితే.. పేద‌ల బియ్యాన్ని దారి మ‌ళ్లించ‌డం తీవ్ర‌మైన అంశ‌మని పేర్కొంది.

“పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే బియ్యాన్ని మీరు దారిమ‌ళ్లించ‌డం నిజ‌మైతే.. దీనికి సంబంధించిన ఆధారాలు నిరూపిస్తే.. తీవ్రంగా ప‌రిణ‌గ‌మించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి అందిస్తున్న ఆహారాన్ని పేద‌ల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక‌పై.. ఇలాంటి త‌ప్పులు చేసేవారిని వ‌దిలి పెట్టుకుండా.. క‌ఠిన చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది.

This post was last modified on March 7, 2025 5:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: Perni Nani

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

25 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

9 hours ago