కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్రలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా 2022లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి, ఆయన బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ వ్యక్తిగత కారణాలు చూపుతూ హాజరు కాలేదు. దీనిపై కోర్టు స్పందిస్తూ రూ.200 జరిమానా విధించింది. ఈ మొత్తం విచారణలో వాదన వినిపించిన ఫిర్యాదుదారుడి న్యాయవాదికి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
సావర్కర్‌పై 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భాజపా, శివసేన (ఏకనాథ్ శిండే వర్గం) నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా సావర్కర్‌ను అవమానించేలా ఉన్నాయంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా సావర్కర్ పేరును అపకీర్తి పాల్జేయాలని కుట్ర పన్నారనే ఆరోపణలు వచ్చాయి.
డిసెంబర్ 2024లో అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ వర్మ రాహుల్ గాంధీని మార్చి 6న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, రాహుల్ గాంధీకి అనేక రాజకీయ కార్యక్రమాలు, విదేశీ ప్రతినిధులతో భేటీలు, ఇతర అధికారిక భాద్యతలు ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మినహాయింపు ఇచ్చినా, జరిమానా విధించడం చర్చనీయాంశమైంది.
ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు మాత్రమే కాదు, గతంలోనూ రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. గుజరాత్‌లోని సూరత్ కోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన 2023లో తన పార్లమెంటరీ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.
This post was last modified on March 6, 2025 11:43 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…