Political News

చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యవహార శైలిపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి విమర్శలకు తగ్గట్లుగానే జగన్ కూడా దొంగలు పడ్డ ఆరు నెలలకు … బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరు రోజులకు స్పందించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి పరోక్షం, ప్రత్యక్షంగా ఎటువంటి సాయం చేయకూడదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏమిటని జగన్ మండిపడ్డారు.

వైసీపీ వాళ్లకు పథకాలివ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా అంటూ జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జడ్జిలు, గవర్నర్ చూడాలని జగన్ కోరారు. అంతేకాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సీఎంగా ఉండేందుకు అనర్హుడని, రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆత్మస్తుతి – పరనింద అన్నరీతిలో బడ్జెట్ ఉందని జగన్ అన్నారు. కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్నట్లు బడ్జెట్ ఉందని సెటైర్లు వేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి నేతల దగ్గర సమాధానం లేదని అన్నారు. మొదటి బడ్జెట్‌లో ఆ హామీలకు బోడి సున్నా కేటాయించారని, రెండో బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేశారని ఆరోపించారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటన్నారు.

సూపర్ సిక్స్ అని కల్లబొల్లి కబుర్లు చెప్పారని, ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి కోసం రూ.7,200 కోట్లు అవసరమైతే, బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. ఇక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. రాయలసీమ మహిళలు చంద్రబాబు ఫ్రీ బస్సు పథకం ఉపయోగించుకొని ఆయన కడుతున్న అమరావతిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

This post was last modified on March 5, 2025 3:49 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

31 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago