వైవిధ్యం ఉంటే చిన్నా పెద్దా తేడా లేకుండా సినిమాలు ఆదరణ పొందడం బాక్సాఫీస్ కు అనుభవమే. సంతాన ప్రాప్తిరస్తు అలాంటి ప్రయత్నంగానే కనిపిస్తోంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ని మధురా శ్రీధర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాన్సెప్ట్ ఏంటో దాచకుండా ట్రైలర్ లో చెప్పేయడంతో ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేయడానికి అవకాశం దొరికినట్టయ్యింది. కలర్ ఫోటో, సమ్మతమే తర్వాత చాందిని చౌదరికి దొరికిన లీడ్ రోల్ ఇదే. క్యాస్టింగ్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఫన్ కి పెద్ద పీఠ వేసిన వైనం ట్రయిలర్లో కనిపించింది.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఒక యువకుడి (విక్రాంత్) కి ప్రేమ,పెళ్లి పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి (చాందిని చౌదరి) ని కోరి జీవిత భాగస్వామిని చేసుకుంటాడు. ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్) ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాటుకుంటాడు. అయితే సంతానం కలిగే విషయంలో వీర్య కణాలు తక్కువగా ఉండటం వల్ల కుర్రాడికి చిక్కు ఎదురవుతుంది. భార్యని వంద రోజుల్లో గర్భవతిని చేసే సవాల్ స్వీకరిస్తాడు. డాక్టర్లు, ప్రకృతి వైద్యులను కలుస్తాడు. అసలు చిక్కు ఇక్కడి నుంచి మొదలవుతుంది. సున్నితమైన సమస్యను ఈ జంట ఎలా ఎదురుకుందనేదే కథ.
వినోదంతో పాటు సందేశం కూడా జొప్పించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి సెన్సిటివ్ పాయింట్ కి కామెడీ జోడించడం బాగుంది. హీరో హీరోయిన్ జోడి ఫ్రెష్ గా అనిపించడంతో పాటు కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు చమత్కారంగా ఉన్నాయి. మగాడి జీవితంలో సులభమైన సంతాన ప్రక్రియను క్లిష్టంగా మార్చారంటూ వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగు ద్వారా సినిమా ఉద్దేశమేంటో చెప్పేశారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, హర్షవర్ధన్, జీవన్ కుమార్, అభయ్, కిరిటీ ఇతర తారాగణం. సునీల్ కశ్యప్ సంగీతం, మహీ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చిన సంతాన ప్రాప్తిరస్తు త్వరలోనే విడుదల కానుంది.
This post was last modified on March 5, 2025 4:14 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…