ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మహిళా నేతలు అనూహ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చారు. మొన్నటిదాకా తమ భర్తలు రాజకీయాలు చేస్తుంటే.. ఈ ఇద్దరు మహిళలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు బయటకొచ్చి సత్తా చాటుతున్నారు. సత్తా చాటడమంటే ఏదో సాదాసీదా రాజకీయాలు చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే… వీరిలో ఒకరు వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటే.. మరో మహిళా నేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న మహిళా నేత… మొన్నటి ఎన్నికల్లో కడప అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి గెలిచిన రెడ్డప్పగారి మాధవి రెడ్డి. చాలా కాలంగా కడప ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేతలో, లేదంటే వైసీపీ నేతలో కొనసాగారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలంగా కొనసాగుతున్న రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణే మాధవి. అప్పటిదాకా శ్రీనివాసులు రెడ్డి రాజకీయం చేస్తుండగా… మాధవి పెద్దగా బయటకే రాలేదు. అయితే ఎప్పుడైతే టీడీపీ అధిష్ఠానం సీటు ఇచ్చిందో… మరుక్షణం నుంచే మాధవి తనలోని ఫైర్ బ్రాండ్ ను బయటకు తీశారు.
వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించడంలో ఎంతమాత్రం వెనకడుగు వేయని మాధవి…నేరుగా జగన్ నే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రాడు… కనీసం జిల్లా అభివృద్ది సమీక్షకూ రాడా?.. ఇలాంటి నేతను పులివెందుల ప్రజలు ఎలా గెలిపిస్తున్నారంటూ ఆమె చేసే వ్యాఖ్యలు నిజంగానే జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఇక తాజాగా రాజకీయ తెర ముందుకు దూసుకువచ్చిన రెండో మహిళా నేత ఎవరంటే… చంద్రగిరి అసెంబ్లీ నుంచి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన పులివర్తి నాని సతీమణి.. పులివర్తి సుధారెడ్డి. నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైనా… రెడ్డి కమ్యూనిటీకి చెందిన సుధారెడ్డి వివాహం చేసుకున్నారు. చాలా కాలం పాటు చిత్తూరు కేంద్రంగా రాజకీయం చేసిన నాని… గత కొంతకాలంగా పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో తన మకాంను చంద్రగిరికి మార్చేశారు.
మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని ఓడించి నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆది నుంచి కూడా నానికి చేదోడువాదోడుగా ఉంటున్న సుధారెడ్డి… పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇటీవల నాని తరపున లంచాలు తీసుకుంటున్నారంటూ చెవిరెడ్డి వర్గం ఆరోపణలు చేసినంతనే ఒక్కసారిగా సుధారెడ్డి తెర ముందుకు దూసుకువచ్చారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే… ఊరుకునేది లేదంటూ చెవిరెడ్డి వర్గానికి సుధారెడ్డి ఇచ్చిన వార్నింగ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on March 4, 2025 9:56 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…