టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా ఏదో ఒక్కసారి అంటే ఓకే గానీ… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… లోకేశ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉండటంతో ఈ మీడియా సంస్థల ప్రతినిధులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
లోకేశ్ అవలంబిస్తున్న ఈ పద్ధతి వైసీపీ నేతలను… అది కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బాగానే ఆకట్టుకుంది. ఏం లోకేశేనా… మన మీడియా సంస్థల పేర్లను చెబుతూ మనల్ని టార్గెట్ చేసేది?..ఏం మనం చేయలేమా? అనుకున్నారో… లేదంటే లోకేశ్ తీరుకు జనంలో మాబాగా అప్లాజ్ వస్తున్న విషయాన్ని చూసి ముచ్చటపడ్డారో తెలియదు గానీ… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లోకేశ్ స్టైల్ ను మక్కికి మక్కి ఫాలో అయిపోయారు. మీడియా సమావేశంలో లోకేశ్ ఎలా అయితే ప్రారంభిస్తున్నారో… అచ్చు గుద్దినట్టుగా రాంబాబు కూడా అదే తీరును ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతోంది.
అంబటి రాంబాబు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపుగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా టీవీ ఛానెళ్లు వరుసగా తమ మైకులను అంబటి ముందు వరుసగా పేర్చి పెట్టి… సార్ ఇక మీదే ఆలస్యం అంటూ చెప్పారు. అంతా సరిచూసుకున్న అంబటి.. లోకేశ్ మాదిరిగా.. టీవీ 5 వచ్చిందా?.. ఆంధ్రజ్యోతి వచ్చిందా?.. ఆ రెండూ వస్తే చాలు…ఇక మొదలెట్టేయవచ్చు అంటూ అలా సాగిపోయారు. ఈ మాట విన్నంతనే ఇటు మీడియా మిత్రులతో పాటుగా అటు అంబటి అనుచరులు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.
This post was last modified on March 4, 2025 2:22 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…