Political News

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా అజెండా ఇదే…!

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ప‌థ‌కాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాట‌లు వినిపించ‌డం కుదర‌దు. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. అధికారంలో ఉండి.. కేవ‌లం ఈ మూడు అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. ప‌థ‌కాలు అంద‌రికీ అందే అవ‌కాశం లేదు. ఎంత ఖ‌ర్చు చేసినా.. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి గూడుక‌ట్టుకునే ఉంటుంది. ఇక‌, సంక్షేమం మాటా అంతే!

ఇక‌, మేనిఫెస్టోలోని అంశాల‌ను పూర్తిగా అమ‌లు చేశామ‌ని చెప్పినా.. జ‌గ‌న్ మాట‌ను పెద్ద‌గా ఎవ‌రూ విశ్వ‌సించ‌లేదు.పైగా.. ప్ర‌త్య‌ర్థుల‌కు.. ఈ మూడు అంశాలు.. ఆయుధంగా మారాయి. ప‌థ‌కాల‌ను మ‌రింత ఎక్కువ‌గా చేసి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. సంక్షేమం అంద‌రికీ అంద‌లేద‌న్న విష‌యాన్ని నారా లోకేష్‌ క్షేత్ర‌స్థాయిలో వివ‌రించారు. మేనిఫెస్టోలో చాలా అంశాలు మిగిలి ఉన్నాయ‌ని.. బీజేపీ చెప్పుకొచ్చింది. పైగా కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే వీటిని అమ‌లు చేశార‌ని తెలిపింది.

ఇవ‌న్నీ.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు చాలా చ‌క్క‌గా ఎక్కాయి. ఇక‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఓట‌ర్లు.. తాము క‌ట్టిన ప‌న్నుల‌తో సంక్షేమం ఏంటి? అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీకి వ్య‌తిరేకంగా మారిపోయారు. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌క్రియ‌లో కూట‌మి పార్ట‌లు స‌క్సెస్ అయ్యాయి. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. అంటే.. జమిలితో ముందుగానే వ‌చ్చినా.. ఈ ద‌ఫా ప‌థ‌కాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాట‌లు వినిపించ‌డం సాధ్యం కాదు. ఒక‌వేళ జ‌గ‌న్ వీటిని ప‌ట్టుకున్నా.. అది విఫ‌ల‌మైన రాజ‌కీయం అవుతుంది.

కాబ‌ట్టే.. కూట‌మి స‌ర్కారు పెద్ద‌లు.. అభివృద్ధి, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను ఎంచుకున్నారు. మూడు పార్టీల‌ను గ‌మ‌నిస్తే.. మూడు ర‌కాల రాజ‌కీయాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అభివృద్ధి స‌హా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అజెండాతో టీడీపీ ముందుకు సాగుతోంది. వీరికి బడ్జ‌ట్‌లోనూ నిధులు ఎక్కువ‌గానే కేటాయించారు. ఇక‌, త‌న ఇమేజ్‌తోనే ముందుకు సాగేందుకు ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హిందూత్వ ఓటు బ్యాంకు చేజార‌కుండా.. బీజేపీ ప‌వ‌న్‌కు క‌లిసి వ‌స్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు అంశాలు.. కీల‌కంగా మారనున్న నేప‌థ్యంలో వైసీపీ త‌న పంథాను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 4, 2025 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

48 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago