ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి న తర్వాత..ఏపీపై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న ప్రధాని.. ఈ క్రమంలో ఇప్పటికి ఒకసారి విశాఖలో పర్యటించా రు. అదేవిధంగా రాష్ట్ర సర్కారు కోరినట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మరోసారి ఏపీకి వస్తున్నట్టు రాష్ట్ర సర్కారుకు సమాచారం అందింది. దీని ప్రకారం ఆయన ప్రధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి రానున్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించ తలపెట్టిన రక్షణ శాఖకు చెందిన క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖలో కీలకమైన క్షిపణి వ్యవస్థకు మోడీ సర్కారు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత టీడీపీ హయాంలోనే నాగాయలంకలోని గుల్లల మోదను ఎంపిక చేశారు. సమీపంలోనే తీరం ఉండడం.. భూమ్యాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిని ఎంచుకున్నారు.
ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్ డీఓ రూ.15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. వైసీపీ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వయంగా వచ్చేందుకుఅంగీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా పీఎంవో(ప్రధాని కార్యాలయం) నుంచి రాష్ట్ర సర్కారుకు సమచారం అందింది.
This post was last modified on March 3, 2025 9:49 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…