కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ నటులైనా.. ఇతర రంగాలకు చెందిన వ్యక్తులైనా… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి సొంతంగా ఒంటి చేత్తో అధికారం చేజిక్కించుకోవడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. ఎక్కడికక్కడ అటు జాతీయ పార్టీలతో పాటుగా… ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా వ్యూహాలు అంతగా పని చేయవని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఏపీనే తీసుకుంటే… జనసేన పేరిట రాజకీయాల్లోకి వచ్చిన పవన్ 2019లో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా విఫలం అయ్యారు. దీంతో వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకున్న పవన్… టీడీపీ, బీజేపీలతో జట్టు కట్టి… ఎంచక్కా అధికార కూటమిలో కీలక భాగస్వామిగా చేరిపోయారు. ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టును దక్కించుకున్నారు.
ఇప్పుడు తమిళనాట కూడా ఇదే తరహాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే తమిళగ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్నది సుస్పష్టం. ఆ దిశగా విజయ తీరాలకు చేరేందుకు అవసరమైన వ్యూహాల రచన కోసం ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకున్నారు. విజయ్ తో కుదిరిన అవగాహన మేరకు ఇప్పటికే పీకే కూడా రంగంలోకి దిగిపోయారు. విజయ్ కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దరి చేరుస్తానని కూడా పీకే ప్రకటించారు. ఈ క్రమంలో విజయ్ వద్ద పీకే ఓ ఆసక్తికర ప్రతిపాదనను చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రతిపాదన ఏమిటంటే… తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీగా డీఎంకే ఉంటే… విపక్షంగా అన్నాడీఎంకే ఉంది. అటు డీఎంకే అధినేత కరుణానిది, ఇటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇద్దరూ మరణించినా… వారి పార్టీలకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. డీఎంకే ఇంకా అధికారంలో కొనసాగుతుంటే.. అన్నాడీఎంకే కూడా 25 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో గట్టిగానే ఉందని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓట్ల శాతం కాస్త తగ్గినా… అన్నాడీఎంకేకు ఓ మోస్తరులో ఓటు బ్యాంకు పెరిగినా… పెద్దగా మార్పేమీ ఉందదు. అంటే… మరోమారు డీఎంకేనే అధికారంలోకి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 40 శాతానికి పైగా ఓట్లను సాధించడం టీవీకేకు సాధ్యపడదు. ఆ మేర పొలిటికల్ వాక్యూమ్ తమిళనాట లేదు. మహా అంటే విజయ్ పార్టీకి ఓ 20 శాతం ఓట్లు పడవచ్చు. అంటే… ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టీవీకే సాధించలేదు.
ఇవే విషయాలను విజయ్ ముందు పెట్టిన పీకే… పీకే మార్కు వ్యూహాన్ని ప్రతిపాదించారట. విపక్షంలో ఉన్న అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీకి దక్కే 25 శాతం ఓట్లకు టీవీకేకు పడే 20 శాతం ఓట్లు, ఇతరత్రా చిన్నాచితక పార్టీల ద్వారా వచ్చే ఓట్లతో అన్నాడీఎంకే, టీవీకేలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పీకే చెప్పారట. ఇలాంటి క్రమంలో ఓటు షేర్ అధికంగా ఉండే అన్నాడీఎంకేకు అంటే.. మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామికి సీఎం సీటును అప్పగించేసి… విజయ్ డిప్యూటీ సీఎం సీటును తీసుకోవచ్చని పీకే చెప్పారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకుమించిన గొప్ప ఐడియా అయితే మరొకటి లేదని కూడా విజయ్ కి పీకే చెప్పేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే సొంతంగానే గెలిచి తీరాలన్న సంకల్పంతో తాను రాజకీయాల్లో వస్తే.. పీకే ఇలాంటి సలహాలు ఇస్తున్నారేమిటన్న సందిగ్ధంలో విజయ్ పడిపోయారట. అయితే వాస్తవ పరిస్థితులేమిటన్న దానిపై ఒకటికి పది సార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి అంటూ పీకే సూచించడంతో విజయ్ ఆలోచనలో పడిపోయారని వినికిడి. మరి విజయ్ కూడా పవన్ బాటలో నడుస్తారా?.. లేదంటే పీకే మాటను పక్కనపెట్టి ధైర్యం చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on March 1, 2025 2:39 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…