ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మోదీతో బేటీ కోసం మంగళవారం రాత్రికే రేవంత్ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అదికారిక నివాసం చేరుకున్న రేవంత్… అక్కడే మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల భేటీ గంటకు పైగానే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీఎంతో మోదీ గంటకు పైగానే భేటీ కావడం గమనార్హం.
ఈ భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం గురించి రేవంత్ ప్రదానంగా ప్రస్తావించినట్లు సమాచారం. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇతోదిక సహకారం అవసరమని రేవంత్ చెప్పారట. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పలు పద్దుల కింద కేంద్రం నుంచి విడుదల కానున్న నిధులను కూడా ప్రస్తావించిన రేవంత్… నిధుల సత్వర విడుదల కోసం మోదీని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు సమాచారం. రేవంత్ అభ్యర్థనలకు మోదీ నుంచి సానుకూల స్పందన లభించిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకుపోయిన కార్మికులు, వారిని బయటకు తీసుకువచ్చేందుకు సాగుతున్న సహాయక చర్యలపైనా మోదీ, రేవంత్ ల భేటీలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజే రేవంత్ కు మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోదీ… అప్పటికప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తెలంగాణకు పంపారు. తాజాగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, తాజా స్థితిగతులను మోదీకి రేవంత్ వివరించినట్లు సమాచారం. వీలయినంత త్వరగా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.
This post was last modified on February 26, 2025 1:37 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…