ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఆ విశిష్ట అతిథి మరెవరో కాదు… ఈ తరం నేతలంతా వీహెచ్ గా… ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు. మంగళవారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఆయన ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం వేళ ఆయన పవన్ తో భేటీ అయ్యారు.
ఉదయం వేళ చంద్రబాబును కలిసిన వీహెచ్… చంద్రబాబుతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను చూసినంతనే ఏదో మర్యాదపూర్వక భేటీనే అని అంతా అనుకున్నారు. ఏదో వ్యక్తిగత పనో, లేదంటే… ఆన్ ద వే జర్నీలో భాగంగానో అమరావతిలో ఆగిన వీహెచ్ పనిలో పనిగా చంద్రబాబును పలకరించి వెళదాం అన్నట్లుగా సాగి ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే కొందరు మాత్రం బాబు, వీహెచ్ ల భేటీ వెనుక ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటూ విశ్లేషణలు ప్రారంభించారు. కొందరైతే ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు వీహెచ్ తీసుకుంటారా? అన్న కోణంలోనూ కథనాలు అల్లేశారు.
తీరా సాయంత్రం వేళ… మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వీహెచ్.. డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హన్మన్న చేతిలో ఏవో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాలను పవన్ చేతిలో పెట్టిన వీహెచ్… ఆయన పక్కనే మంచంపై కూర్చుని వీహెచ్ దాని గురించి వివరించారు. ఆ సంగతేమిటన్న విషయంలోకి వెళితే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత కాంగ్రెస్ నేత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, ఆయన పేరిట ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అందులో పవన్ ను వీహెచ్ కోరారు. సామాజిక పింఛన్లతో పాటు కార్మికులు పలు సౌకర్యాల అందజేతకు బీజం వేసిన దామోదరం సేవలను మరిచిపోరాదని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారట. మరి ఈ వినతి పత్రాన్ని వీహెచ్.. చంద్రబాబుకు కూడా ఇచ్చారా? లేదా? అన్న విషయం అయితే తెలియరాలేదు.
This post was last modified on February 26, 2025 10:05 am
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…