ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన సీఎం.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చూస్తున్నపంచాయతీ రాజ్ ను ప్రస్తావించారు. తన శాఖను పవన్ కల్యాణ్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. తాను అస్సలు ఊహించలేదని.. చాలా బాగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికిగాను తాను పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో చేపడుతున్న స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు.
“ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టారు. ఇది అంత తేలిక విషయం కాదు. గతంలో మేం అను కున్నా.. చేయలేకపోయాం. కానీ, పవన్ కల్యాణ్ సాధించారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదేసమయంలో మూడో శనివారాన్ని స్వచ్ఛాంద్రకు కేటాయించగానే.. తాను కూడా మూడో శనివారం అన్ని పనులు పక్కన పెట్టి దానికోసమే కష్టపడు తున్నారని వ్యాఖ్యానించారు. ఒకే రోజు నిధులు కేటాయించడం ద్వారా పనులు వేగంగా చేసేందుకు ప్రయత్నించారన్నారు.
అదేవిధంగా గత వైసీపీ పాలనపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గతంలో పంచాయతీల సొమ్మునునొక్కేశారని, దారి మళ్లించారని కనీసం మంచినీటి సదుపాయాలకు కూడా నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అందుకే పంచాయతీల్లో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటి క్లిష్టమైన శాఖను కూడా తీసుకుని పవన్ కల్యాణ్ బ్రహ్మాండంగా నాయకత్వం వహించి ముందుకు తీసుకెళుతున్నారని దీనిని చూసి మిగిలిన శాఖల మంత్రులు కూడా స్ఫూర్తి పొందాలని చంద్రబాబు సూచించారు.
గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందన్న ముఖ్యమంత్రి.. దీనిపై ఢిల్లీలో ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. “ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించి సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ తీసుకువచ్చిన ఘనత పవన్ కే చెల్లింది” అని చంద్రబాబు అన్నారు. అయితే.. పంచాయతీల్లో గత ఐదేళ్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పనులు నిలిచిపోయాయని, రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు. దీంతో ఇప్పుడు పనులు చేపడుతున్నా కొంత మందకొడిగా సాగుతోందని చెప్పారు. ఈ విషయంలో కూడా.. దృష్టి పెడితే.. మరింతగా పంచాయతీ వ్యవస్థ అభివృద్ది చెందుతుందని చెప్పారు.
This post was last modified on February 25, 2025 10:03 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…