రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్స్ స్థానాల నుంచి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఆ స్థానాల జయాపజయాలపై పెద్దగా ఇబ్బందేమీ ఉండదనే చెప్పాలి. అయితే గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు మాత్రం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే… ఈ ఎన్నికల్లో ఓటర్లంతా డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించిన వారే కావడం. ఆయా అంశాలపై ప్రభుత్వాలతో పాటుగా విపక్షాలు అనుసరిస్తున్న అడుగులను లెక్కేసుకుని మరీ గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారు. ఈ ఫలితాలను ముందుగా అంచనా వేయడం కూడా అంత ఈజీ కాదు కూడా.
తెలంగాణలో ఒకే గ్రాడ్యుయేట్ స్థానం ఉంది… పెద్దగా ఇబ్బంది లేని వ్యవహారమే. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలున్నాయి. మూడు పార్టీలతో కూడిన కూటమి అధికారంలో ఉంది. రెండు స్థానాలను చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ పోటీలోనే లేదు. అయితే కూటమి అభ్యర్థులపై పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ చర్యతో వైసీపీ సేఫ్ గేమ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. అయితే ప్రతిపక్షం పోటీలో లేని ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతే…కూటమిపై ప్రతికూల ప్రభావం తప్పదు. అందుకే… గతంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈఎన్నికలపై దృష్టి సారించారు. పలువురు మంత్రులు, కీలక నేతలకు పలు ప్రాంతాలకు ఇంచార్జీలుగా నియమించి నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గెలుపుతో పాటుగా మంచి మెజారిటీ కూడా రావాల్సిందేనని కూడా చంద్రబాబు నేతలకు టార్గెట్లు పెట్టారు.
ఇంకో వారంలో ఈ ఎన్నికల కీలక ఘట్టం పోలింగ్ జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో గ్రూప్ 2 అభ్యర్థుల పోరుబాట కూటమికి ఇబ్బందిగా పరిణమించనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ 2 పోస్టుల భర్తీలో రోస్టర్ విధానాన్ని ఖరారు చేయకుండా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైపోయింది. అయితే రోస్టర్ విధానం లేకుండా పరీక్షలు నిర్వహిస్తే తమకు తీరని నష్టం జరుగుతుందని అభ్యర్థులు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఈ తరహా తప్పిదాలే మొత్తం నియామక ప్రక్రియను కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తుందని…ఫలితంగా పుణ్య కాలం ముగిసిపోతుందని వారు వాపోతున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని తాము కోరడం లేదని చెబుతున్న అభ్యర్థులు. పరీక్షల్లోపే రోస్టర్ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది జరకపోతే..కూటమి సర్కారుకు తమ ప్రతాపం ఏమిటో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. గ్రూప్ 2 ఉద్యమాల్లో ఒకింత ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న కొందరు నిరుద్యోగులు… కూటమి ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలు ముగిసి అప్పుడే 9 నెలలు అయిపోతోందని… మరి నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా…మరోవైపు నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ఎలాగంటూ కొందరు అభ్యర్థులు లాజిక్కులు తీస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 2 వివాదాన్ని వీలయినంత త్వరగా పరిష్కరించి…వారిని పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధమయ్యేలా చేయకపోతే కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు దీనిపై ఏమాత్రం దృష్టి సారిస్తారో చూడాలి.
This post was last modified on February 22, 2025 10:58 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…