వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై లెక్కలేనన్ని విశ్లేషణలు, విమర్శలు, సమర్థంపులు వినిపిస్తున్నాయి. వీటిలో ఎవరి వాదన వారిదే. టీడీపీ వారేమో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి భద్రత ఎలా కల్పిస్తామని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి భద్రత కల్పించడానికి వీల్లేదు. మిర్చి రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకమా? ఎన్నికల కోడ్ ఉంటే… రైతుల సమస్యలను గాలికి వదిలేయాలా? అని వైసీపీ వాదిస్తోంది. అదీ కరెక్టేనని అనిపిస్తుంది. ఇక న్యూట్రల్ వర్గాలేమో.. అయినా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జగన్ కు సెక్యూరిటీ కల్పించేది కేంద్రం కదా… ఈ విషయంతో చంద్రబాబు సర్కారుకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నాయి. ఇదీ నిజమే. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా…కొన్ని పర్యటనల్లో స్థానిక పోలీసులు కొంత మేర భద్రతా చర్యలు చేపట్టాలి కదా అన్నది మరో వాదన.
ఈ వ్యవహారంలో ఏ వాదన విన్నా.. అదే కరెక్టు అని చెప్పక తప్పని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు, జగన్ కు తండ్రి సమానుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం తన కుమారుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేపథ్యంలో నెల్లూరులోని తన సొంతింటిలో తనను కలిసిన ఓ టీవీ ఛానెల్ తో మేకపాటి తన మనసులోని మాటను ఎలాంటి బేషజాలు లేకుండానే బయటపెట్టారు. ఓ సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా… ఏ వర్గాన్ని వెనకేసుకుని రాకుండా… రెండు వర్గాలకూ హిత బోధ చేసిన మేకపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ వయసులో చిన్నవాడని… అనుభవం లేని కారణంగా పాలనలో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని ఒప్పుకున్నారు. అదే సమయంలో సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తెలిసి మరీ తప్పులు చేయరాదు కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మేకపాటి సీనియర్ ఏమన్నారన్న విషయానికి వస్తే… జగన్ ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లభిస్తోందని మేకపాటి తెలిపారు. ఇక సీఎం హోదాలో చంద్రబాబుకు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని ఆయన గుర్తు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కవర్ లో ఉన్న జగన్ సెక్యూరిటీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని ఆయన అన్నారు. మొన్నటి గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్ కు భద్రత కరువైన వైనం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జగన్ అనుభవ లేమితో తప్పులు చేసే ఉండొచ్చు… అలాగని జగన్ తప్పులు చేశారని… 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తప్పులు చేయకూడదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఎవరు ఉన్నా.. విపక్ష నేతలను, విపక్ష పార్టీలను గౌరవించి తీరాల్సిందేనన్నారు. ఇప్పుడు చంద్రబాబు అలా వ్యవహరిస్తే.. రేపు జగన్ అధికారంలోకి వస్తే.. ఆయన తప్పు చేస్తున్నా తాము ఆయనను నిలదీస్తామని మేకపాటి చెప్పుకొచ్చారు.
This post was last modified on February 21, 2025 6:30 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…