ఏపీలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్న ఆరోపణలు నిన్నటిదాకా దాదాపుగా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేరుగానే రంగంలోకి దిగిపోవడంతో ఆ సమస్య కేవలం ఒక్కటంటే ఒక్క రోజులలోనే పరిష్కారం అయిపోయింది. నష్టాల బాటలో కొనసాగుతున్న అన్నదాతకు భారీ ఊరట లభించింది. ఒకటి, రెండు రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర లభించే దిశగా చర్యలు కూడా మొదలు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం క్విక్ రియాక్షన్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ…మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళిని తోసిరాజని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఈ విషయంపై దృష్టి సారించిన చంద్రబాబు… మిర్చి రైతులకు జగన్ పరామర్శతో నేరుగా రంగంలోకి దిగిపోయారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. ఇక ఆ మరునాడే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు… లేఖలతో అయితే పని కాదనుకున్నారో, ఏమో తెలియదు గానీ… నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు వెళ్లిపోయారు.
చంద్రబాబు వెళ్లిన సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తన కార్యాలయంలో అందుబాటులో లేరట. అయితే చంద్రబాబు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న ఆయన మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసి చంద్రబాబుతో భేటీ కావాలని ఆదేశాలు జారీ చేశారు. తాను ఎక్కడో బయట ఉన్నా… వర్చువల్ గా చౌహాన్ కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మిర్చి రైతుల పరిస్థితిని సమగ్రంగా వివరించిన చంద్రబాబు…కేంద్రం ఆదుకోక తప్పదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్రానికి ఉన్న పరిమితులను కూడా చంద్రబాబే గుర్తు చేసి.. వాటిని ఎలా అధిగమించాలన్న దిశగా పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సిందేనని చెప్పిన చంద్రబాబు… రాష్ట్రం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఎంతైనా చౌహాన్ కూడా సీఎంగా పనిచేసిన వారే కదా. చంద్రబాబు ఆవేదనను, సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర మంత్రి రాత్రికి రాత్రే సమస్య పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తెల్లారగట్లే ఏపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని పిలిచి… ఆయన సమక్షంలోనే వ్యవసాయ, మార్రెంటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కేంద్రం 25 శాతం పంట ఉత్పత్తులనే కొనే అవకాశం ఉన్నా… ఆ పరిమితిని ఏకంగా 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ఈ మేర కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించే దిశగా ఓ కీలక నిర్ణయం జరిగిపోయింది. అనంతరం ఏపీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ అధికారులతో వర్చువల్ గా మాట్లాడిన చౌహాన్.. కేంద్రం నిర్ణయాలను తెలియజేసి…ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వెరసి మిర్చి రైతుల సమస్య కేవలం గంటల వ్యవధిలోనే పరిష్కారం అయిపోయింది.
This post was last modified on February 21, 2025 1:13 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…