Political News

ఐదేళ్లు పందికొక్కుల్లా దోచుకున్నారు: డోస్ పెంచిన ష‌ర్మిల‌

త‌న సోద‌రుడు జ‌గ‌న్ పార్టీ వైసీపీపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్‌. ష‌ర్మిల‌ తాజాగా డోస్ పెంచారు. వైసీపీ నాయ‌కులు గ‌త ఐదేళ్లు పాల‌న‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జాధ‌నాన్ని, వారి ఆస్తుల‌ను కూడా పందికొక్కుల్లా దోచుకుతిన్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ కూడా లేకుండా పోయింద‌న్నారు. అందుకే ప్ర‌జ‌లు ఛీ కొట్టి 11 స్థానాల‌కే ప‌రిమితం చేశార‌ని ష‌ర్మిల నిప్పులు చెరిగారు.

ప్ర‌జ‌లు త‌మ‌ను ఉద్ధ‌రిస్తార‌ని అధికారం ఇస్తే.. తాడేప‌ల్లి ప్యాల‌స్‌కే ప‌రిమితం అయిందెవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని చెప్పారు. తాము ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం లేద‌ని.. కేవ‌లం సోష‌ల్ మీడియాలో ఏదో వ్యాఖ్య‌లు చేస్తే.. స్పందించేది లేద‌న్న మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌ను ఆమె ఖండించారు. తాము ప్ర‌జ‌ల కోసం ప్ర‌తినెలా పోరాటాలు చేస్తున్నామ‌ని.. ప్ర‌తి జిల్లాలోనూ త‌మ పార్టీ నాయ‌కులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.

“రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నారు. ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు“ అని వైసీపీ నాయ‌కుల‌పై ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరు మిర్చి యార్డు రైతుల క‌ష్టాల‌ను తామే వెలుగులోకి తెచ్చామ‌న్న ఆమె.. ఇప్పుడు తీరిగ్గా వైసీపీ స్పందించిం దని.. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉన్నాయి కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తూ..ఏదో న‌మ్మించాల‌ని చూస్తోంద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేద‌న్న బొత్స వ్యాఖ్య‌ల‌పైనా ఆమె స్పందించారు. అస‌లు పాల‌సీ లేనిది.. బీజేపీతో తెర‌చాటు కాపురం చేసింది.. వైసీపీనేన‌ని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీకి ద‌త్త‌పుత్రుడు ఎవ‌రు? అని అడిగితే.. ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేది ఎవ‌రి పేరో బొత్స తెలుసుకోవాల‌న్నారు. “151 సీట్ల నుంచి వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. అయినా మీ వైఖరీలో మార్పు రావడం లేదు“ అని దుయ్య‌బ‌ట్టారు. మొత్తానికి ష‌ర్మిల త‌న దాడిలో డోస్ పెంచ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 21, 2025 9:04 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

15 minutes ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

32 minutes ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

37 minutes ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

57 minutes ago

దేవా కట్టాపై రాజమౌళి ప్రేమ,

దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…

2 hours ago

అశోక్‌కే చంద్ర‌బాబు మొగ్గు.. ఏం జ‌రుగుతోంది ..!

విజ‌య‌న‌గ‌రం మాజీ ఎంపీ పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్నారా?  ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ నాయ‌కుడైనప్ప‌టికీ..…

2 hours ago