Political News

అప్పుడు విన‌లేదు.. ఇప్పుడు వింటారా? : వైసీపీ టాక్‌!

వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మాట వింటామ‌ని.. జ‌గ‌న్ 2.0లో వారికే ప్ర‌ధానంగా ప్రాధాన్యం ఇస్తామ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. ఆ మాట చెప్ప‌గానే.. ప‌లు జిల్లాల నుంచి నాయ‌కులు తాడేప‌ల్లి ప్యాల‌స్‌కు క్యూ క‌డుతున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారిని మార్పు చేయాల‌ని వారు కోరుతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు గ‌త ఏడాది కూడా.. అనేక మంది నాయ‌కులు ఇవే డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌(అప్ప‌టి) పెత్త‌నం ఎక్కువైంద‌ని.. తాము వేగ‌లేక పోతున్నామ‌ని వారు తెలి పారు. అలాంటి వారికి టికెట్ ఇవ్వ‌ద్ద‌ని, వారిని ప్రోత్స‌హించ‌ద్ద‌ని కూడా చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం, భూముల విష‌యంలో వారు చేస్తున్న అవినీతిని కూడా వైసీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు అధినేత ముందు పెట్టారు. కానీ, అప్పట్లో వారి మాట‌ల‌ను లైట్ తీసుకున్న జ‌గ‌న్‌.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కుల‌కే అవ‌కాశం ఇచ్చారు. ఈ ప్ర‌భావం పార్టీలో చీలిక‌లు తెచ్చింది.

ఫ‌లితంగా వైసీపీ కంచుకోట‌లుగా ఉన్న మాచ‌ర్ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ దూసుకుపోయింది. ఇప్పుడు మీ మాటే వింటాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు తాడేప‌ల్లికి వ‌చ్చి మ‌రోసారి అక్క‌డి నేత‌ల‌పై ఫిర్యాదులు చేయ‌డం ప్రారంభించారు. ఇలాంటి వారిని తొల‌గించాల‌ని వారు కోరుతున్నారు. ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యేలే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నారు. ఇలాంటి వారితో తాము క‌లిసి ముందుకు న‌డ‌వ‌లేమ‌ని చెబుతున్నారు.

అయితే.. వీరి ఆవేద‌న ఎలా ఉన్నా. జ‌గ‌న్ స‌ద‌రు ఇంచార్జ్‌ల‌ను మార్చే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం లేదు. వారికి.. జ‌గ‌న్ కు ఉన్న బాండింగ్ కావొచ్చు.. సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా, ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్న నాయ‌కులు కావొచ్చు. ఏదేమైనా.. ఇత‌ర నాయ‌కులు కోరుతున్న‌ట్టుగా జ‌గ‌న్ చేసే అవ‌కాశం అయితే లేకుండా పోయింది. కానీ, ప్ర‌స్తుతానికి వారి విన‌తులు మాత్రం తీసుకుంటున్నారు. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 21, 2025 8:40 am

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

18 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

26 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

30 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

51 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago