ఏదైనా కేసులో నిందితుడు నిజాలు చెప్పకుంటే… వారి నుంచి నిజాలు రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులను కోరుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టులు తీర్చులు చెబుతూ ఉంటాయి. మరికొన్ని కేసుల్లో కస్టడీ అవసరం లేదని కూడా కోర్టులే చెబుతుంటాయి. అయితే పోలీసు కస్టడీ అంటే…నిందితులను పోలీసులు కొట్టి మరీ నిజాలు రాబడతారన్న వాదనలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి.
అది కూడా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై వైసీపీ హయాంలో జరిగిన థర్డ్ డిగ్రీ ప్రయోగమే ఈ తరహా వాదనలకు ఆస్కారం ఇచ్చాయని చెప్పాలి. నాడు సీఐడీ కస్టడీలో పోలీసులు కొట్టిన దెబ్బలకు రఘురామ పాదాల కింది భాగమంతా కమిలిపోయింది. చాలా రోజుల పాటు ఆయన సరిగ్గా నడవలేకపోయారు కూడా. ఇప్పుడు పోలీసు కస్టడీ అంటేనే ఆయా నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగమేనని ఏకంగా లాయర్లే చెబుతున్న తీరు విస్తుగొలుపోతందని చెప్పాలి.
అయినా ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే… దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టయ్యారు. కదా. ఈ కేసులో మరింత మేర సమాచారం రాబట్టాల్సి ఉందని చెప్పిన పోలీసులు.. వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ కోసం వంశీకి నోటీసులు జారీ చేయగా..వంశీ తరఫున వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
ఈ కౌంటర్ లో సుధాకర్ రెడ్డి ఏం ప్రస్తావించారో తెలియదు గానీ… కౌంటర్ దాఖలు చేసి కోర్టు బయటకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇక తాను చెప్పదలచుకున్నది ఏమీ లేదని న్యాయమూర్తి ఎదుటే వంశీ చెప్పేశారని ఆయన అన్నారు. న్యాయమూర్తి ఎదుటే ఇంత స్పష్టంగా చెబితే… ఇక వంశీ నుంచి పోలీసులు ఏం నిజాలు రాబడతారని ఆయన ప్రశ్నించారు. కేవలం వంశీని కొట్టేందుకు, ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు మాత్రమే పోలీసులు వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చాలా కేసుల్లో పోలీసు కస్టడీలోనే నిందితులు నోరు విప్పి నిజాలు చెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఆధారాలు లేకుండా ప్రశ్నిస్తే…నిందితులు నిజాలు ఒప్పుకోకపోవచ్చు. అదే కొన్ని కీలక ఆధారాలను వారి ముందు పెట్టి ప్రశ్నిస్తే తప్పనిసరిగా నిజాలు ఒప్పుకుని తీరతారు. వాస్తవానికి పోలీసు కస్టడీలో జరిగేది ఇదే. నిబంధనలు అతిక్రమించే కొందరు పోలీసులు నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చేమో గానీ… పోలీసు కస్టడీ అంటేనే థర్డ్ డిగ్రీ ప్రయోగమేనని భావించడం కరెక్టు కాదు కదా. సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేయలేదని వంశీ చెబుతుంటే… సత్యవర్థన్ ను వంశీ బలవంతంగా తీసుకెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇలాంటి ఆధారాలను చూపి వాస్తవాలేమిటో వంశీ నుంచే పోలీసులు రాబట్టే అవకాశం ఉంది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 20, 2025 11:04 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…